New World Record With 200-Kg Cake : 200 కేజీల కేక్ తయారు చేసి ప్రపంచ రికార్డ్ సాధించిన మహిళ.. ఈ కేక్ స్పెషాలిటీ ఏంటంటే?

రాయల్ ఐసింగ్ విధానంలో కేకు తయారు చేయడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఈ విధానంలో 200 కేజీల కేకును తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.

New World Record With 200-Kg Cake : 200 కేజీల కేక్ తయారు చేసి ప్రపంచ రికార్డ్ సాధించిన మహిళ.. ఈ కేక్ స్పెషాలిటీ ఏంటంటే?

New World Record With 200-Kg Cake

New World Record With 200-Kg Cake : బర్త్ డేలు.. పెళ్లిరోజులు.. ప్రత్యేక రోజుల్లో కేకులు ఆర్డర్ ఇస్తాం. బనానా కేక్, చాక్లెట్ కేక్, టూటీ ఫ్రూటీ కేక్, హనీ కేక్, వాల్నట్ కేక్ ఇలా అనేక రకాల్లో పెద్దలు, పిల్లలు ఇష్టపడే విధంగా తయారు చేయించుకుంటాం. కేకు తయారీ కూడా గొప్ప కళ. ఈ కళలో ప్రపంచ రికార్డు సాధించడం అంటే మాటలా? ప్రాచీ దహబల్ దేబ్ అనే మహిళ ఎన్నో రకాల కేకులను తయారు చేయడమే కాదు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. తాజాగా ఆమె తయారు చేసిన కేకు.. రికార్డు వివరాలు తెలుసుకుందామా?

5 years Boy order ice cream : రూ.65 వేల విలువ ఐస్‌క్రీమ్‌లు,కేకులు ఆర్డర్ చేసిన బుడ్డోడు..షాక్ అయిన తండ్రి

మహారాష్ట్ర పుణెలోని పింప్రి చించ్వాడ్‌లో నివాసం ఉండే ప్రాచీ దహబల్‌ దేబ్‌ అనే మహిళ రకరకాల ఆకృతులతో కేకులు తయారు చేస్తారు. రీసెంట్ గా 200 కిలోల భారతీయ రాజభవనం నమూనాను తయారు చేశారు. రాయల్ ఐసింగ్ అనే విధానంలో ఆమె తయారు చేసిన ఈ కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. రాయల్ ఐసింగ్ అనేది ప్రత్యేకమైన కళ అట.

 

బ్రిటన్ రాజ కుటుంబం కోసం తయారు చేసే కేకుల్ని అందంగా అలంకరించడానికి కూడా రాయల్ ఐసింగ్‌ను ఉపయోగిస్తారట. ఈ కళలో మెళకువలు నేర్చుకోవడం కోసం ప్రాచీ లండన్ వెళ్లారట. ఇందులో ప్రావీణ్యం సంపాదించిన ఆమె తాజాగా ప్రపంచ రికార్డును సాధించారు. అన్నట్లు ప్రాచీ ఈ కేకులు తయారీ 11వ ఏటనుంచి మొదలు పెట్టారట.

550 cakes..viral birthday : 550 కేకులు కట్ చేసి బర్త్‌డే వేడుక..అరెస్ట్ చేయాలని డిమాండ్

గతంలో మిలాన్‌ కేథడ్రల్‌ మోడల్‌లో 100 కేజీల కేకును తయారు చేసి ప్రాచీ రికార్డు కొల్లగొట్టారు. అంతేకాదు అత్యధికంగా వీగన్ రాయల్ ఐసింగ్‌తో కేకులు రూపొందించిన ప్రపంచ రికార్డు కూడా ప్రాచీ పేరు మీదనే ఉండటం విశేషం.