550 cakes..viral birthday : 550 కేకులు కట్ చేసి బర్త్‌డే వేడుక..అరెస్ట్ చేయాలని డిమాండ్

ఓ వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకలో 550 కేకులు కట్ చేసిన హాట్ టాపిక్ గా మారాడు.అతడిని అరెస్ట్ చేయాలంటే డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే..

550 cakes..viral birthday : 550 కేకులు కట్ చేసి బర్త్‌డే వేడుక..అరెస్ట్ చేయాలని డిమాండ్

Man Birthday Cut 550 Cakes

man birthday cut 550 cakes : ప్రతీ సంవత్సరం వచ్చే పుట్టిన రోజు వేడుకను కూడా..చాలామంది పుట్టిన రోజును కూడా ఆర్భాటంగా చేసుకోవాలనుకుంటారు. అలా తన పుట్టిన రోజును అత్యంత ఘనంగా చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకను వెరైటీగా జరుపుకున్నాడు. తన పుట్టిన రోజు గురించే అందరు గొప్పగా చెప్పుకోవాలనుకున్నాడో లేదా వైరల్ కావాలనుకున్నాడో గానీ..ఏకంగా 550 కేకులు కట్ చేసి ..బర్త్‌డేను హాట్ టాపిక్‌గా మార్చేశాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more : బర్త్ డే కేక్ కట్ చేసినందుకు ఆయుధ చట్టంకింద అరెస్ట్..!!

ముంబైలోని కందివలి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో సూర్య రాతూరి అనే వ్యక్తి మంగళవారం (అక్టోబర్ 12,2021) పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ వేడుకకు తన స్నేహితుల్ని బంధువుల్ని పిలిచాడు. అలా అందరు వచ్చాక తన ఆర్భాటాన్ని ప్రారంభించాడు. ఒకేసారి 550 కేకులు కట్ చేసి ఔరా అనిపించాడు. పలు రంగుల్లో ఉన్న ఆ 550 కేకులను మూడు పెద్ద టేబుల్స్‌పై అమర్చాడు. తర్వాత సూర్య తన రెండు చేతులతో కత్తి తీసుకుని కేక్‌ను ఒక్కొక్కటిగా కట్ చేశాడు.

Read more : Golden Bride : ఈమె బంగారు పెళ్లికూతురు.. వంటిపై 60కేజీల పసిడి

ఈ కార్యక్రమానికి హాజరయినవారంతా చప్పట్లు కొట్టి బర్త్ డే బాయ్ కు విషెష్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే టూయూ అంటే పాటలు పాడి హోరెత్తించారు.నానా హంగామా చేశారు. ఇక్కడ గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమింటే ఈ బర్త్ డే బాయ్ పార్టీకి వచ్చినవారు ఎవ్వరు కొవిడ్ నిబంధనలు పాటించలేదు. ఎవ్వరు మాస్కులు పెట్టుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.