Amaran – In The City : ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా ‘అమరన్’..

Amaran – In The City : ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా ‘అమరన్’..

Aadi Saikumar New Movie Amaran In The City Launched

Updated On : April 24, 2021 / 6:09 PM IST

Amaran – In The City: వైవిధ్యమైన కథా చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్న యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఎస్‌.వీ.ఆర్‌ ప్రొడక్షన్‌ పై.లి. పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘అమరన్‌’ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’..

Amaran

అవికా గోర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్‌.బల‌వీర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఎస్‌.వీ.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ క్లాప్ కొట్ట‌గా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వీర‌భ‌ద్రం చౌద‌రి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Amaran

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఇన్నోవేటివ్‌, యూనిక్‌ పాయింట్‌తో ‘అమరన్‌’ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా రూపొందుతుంది. గత చిత్రాల కంటే ఆది సాయికుమార్‌ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్‌ టచ్‌ కూడా ఉంటుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత‌లు.

అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా చేయ‌బోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్‌ రెండేళ్ల పాటు శ్రమించారు. ప్రేక్షకకులను ఎంగేజ్‌ చేసే కథాంశంతో థ్రిల్లర్‌, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర్‌ శంకర్‌, పవిత్రా లోకేష్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీత సారథ్యం వహిస్తుండగా శాటి.ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Amaran

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: ఎస్‌.బల‌వీర్‌
సమర్పణ: జెమినీ
నిర్మాత: ఎస్‌.వీ.ఆర్‌
సంగీతం: కృష్ణ చైతన్య కొల్లి
సినిమాటోగ్రఫీ: శాటి.ఎం
లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్వేతా కటకం
పబ్లిసిటీ డిజైనర్‌: ఓంకార్ కడియం
కాస్ట్యూమ్స్ డిజైనర్: దేవి పరుచూరి
కో డైరెక్టర్: రాఘవ.టి..