Aamani : ఆ డైరెక్టర్స్ సినిమాల్లో నటించాలనుంది

ఆమని మాట్లాడుతూ.. ‘‘నా మేనకోడలు హ్రితిక పెద్ద డైలాగ్‌ని కూడా సింగిల్‌ టేక్‌లో చెప్పడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఒక నటికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తి రాదు. ఇంకా ఏదో చేయాలనే....

Aamani : ఆ డైరెక్టర్స్ సినిమాల్లో నటించాలనుంది

Aamani

Aamani :  ఒకప్పటి హీరోయిన్ ఆమని ఇటీవల మళ్ళీ సినిమాలు చేస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తుంది. అప్పుడప్పుడు టీవీ షోలలో కూడా మెరిపిస్తుంది. తాజాగా ఆమని మేనకోడలు హ్రితిక హీరోయిన్ గా ‘అల్లంత దూరాన’ అనే సినిమా రాబోతుంది. తాజాగా ‘అల్లంత దూరాన’ సినిమా ప్రెస్ మీట్ లో ఆమని పాల్గొని ఆసక్తికర విషయాలని తెలిపింది.

ఆమని మాట్లాడుతూ.. ‘‘నా మేనకోడలు హ్రితిక పెద్ద డైలాగ్‌ని కూడా సింగిల్‌ టేక్‌లో చెప్పడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఒక నటికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తి రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటుంది. నాకు మణిరత్నం, రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాథ్‌ గారి సినిమాల్లో నటించాలనుంది’’ అని అన్నారు.

Rakhi Sawant : వ్యాలెంటైన్స్ డే రోజే విడాకులు తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ గా పరిచయం అవుతున్న తన మేనకోడలికి శుభాకాంక్షలు తెలియచేశారు. తెలుగు, తమిళ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్‌ తేదీని ప్రకటించనున్నారు.