Arjun : ఆ విషాదాలు మరవకముందే.. యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి కన్నుమూత..

శనివారం ఉదయం అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ మరణించారు. 85 సంవత్సరాల వయసులో వయో భారంతో, ఆరోగ్య సమస్యలతో బెంగళూరు అపోలో హాస్పిటల్ లో..........

Arjun : ఆ విషాదాలు మరవకముందే.. యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి కన్నుమూత..

Arjun Sarja

Arjun Sarja :  యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. దర్శకుడిగా కూడా చాలా సినిమాలు తెరకెక్కించిన అర్జున్ ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే తన దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మొదలైంది. తాజాగా అర్జున్ కుటుంబం విషాదంలో మునిగింది.

Karthikeya 2 : సీరియల్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్.. ప్రమోషన్స్ లో కొత్త స్టంట్..

శనివారం ఉదయం అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ మరణించారు. 85 సంవత్సరాల వయసులో వయో భారంతో, ఆరోగ్య సమస్యలతో బెంగళూరు అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. గతంలో ఆవిడ మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేశారు. ఇటీవల కరోనా సమయంలో అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో చిరంజీవి సర్జా మరణించారు. ఆ తర్వాత అర్జున్ భార్య తండ్రి, నటుడు రాజేష్ మరణించారు. ఈ విషాదాలు మరవకముందే ఇప్పుడు ఇలా తల్లిని కోల్పోవడంతో అర్జున్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అర్జున్ మాతృమూర్తి మరణించడంతో అర్జున్, అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.