Divya Vani Met With Bjp Mla Etala : బీజేపీలో చేరే అంశాన్ని తొందరలోనే ప్రకటిస్తా : దివ్యవాణి

ఇటీవ‌లే టీడీపీకి గుడ్ బై చెప్పిన నటి దివ్య‌వాణి బీజేపీలో చేరుతున్నారా? కాషాయం తీర్థం పుచ్చుకోవటానికి దివ్యవాణి అన్ని సిద్ధం చేసుకున్నారా? అంటే బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల‌ రాజేందర్ తో ఆమె భేటీ కావ‌డం నిజమనిపిస్తోంది. ఈటెల‌ను క‌ల‌వ‌డంతో బీజేపీలో చేరిక ఖాయం అనే వార్తలు వస్తున్న క్రమంలో దివ్యవాణి స్పందించారు.బీజేపీ లో చేరే అంశాన్ని తొందరలోనే ప్రకటిస్తానని తెలిపారు.

Divya Vani Met With Bjp Mla Etala : బీజేపీలో చేరే అంశాన్ని తొందరలోనే ప్రకటిస్తా : దివ్యవాణి

Divya Vani Met With Bjp Mla Etala

Divya Vani Met With Bjp Mla Etala : ఇటీవ‌లే టీడీపీకి గుడ్ బై చెప్పిన నటి దివ్య‌వాణి బీజేపీలో చేరుతున్నారా? కాషాయం తీర్థం పుచ్చుకోవటానికి దివ్యవాణి అన్ని సిద్ధం చేసుకున్నారా? అంటే బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల‌ రాజేందర్ తో ఆమె భేటీ కావ‌డం నిజమనిపిస్తోంది. ఈటలతో దివ్యవాణి భేటీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తో సినీ న‌టి దివ్య‌వాణి స‌మావేశం అయ్యారు. హైద‌రాబాద్ శామీర్ పేట‌లో ఉన్న ఈట‌ల నివాసానికి దివ్యవాణి వెళ్లి భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో దివ్యవాణి బీజేపీలోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ఈటెల‌కు తెలిపినట్లుగా సమాచారం. దీంతో అదిష్టానంతో మాట్లాడి తాను నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారట ఈటెల రాజేందర్..

ఈటెల‌ను క‌ల‌వ‌డంతో బీజేపీలో చేరిక ఖాయం అనే వార్తలు వస్తున్న క్రమంలో దివ్యవాణి స్పందించారు.బీజేపీ లో చేరే అంశాన్ని తొందరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ నేతలు తనను సంప్రదించారని..ఈ రోజు ఈటెల రాజేందర్ తో సమావేశం అయ్యానని ఆమె తెలిపారు.పార్టీ లో చేరికపై చర్ఛజరిగిందని..తెలంగాణతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని దివ్యవాణి వెల్లడించారు.నాకు తమిళ నాడు, కర్ణాటక తో కూడా మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా దివ్యవాణి చెప్పుకొచ్చారు. బీజేపీ ని మరింత బలోపేతం చేయడానికి నావంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు దివ్యవాణి.

కాగా..టీడీపీలో తనకు తీవ్ర అన్యాయం జ‌రిగిందని..పార్టీ కోసం ఎంతో కష్టపడినా గుర్తింపు రాలేదంటూ మీడియా సమావేశంలో దివ్యవాణి క‌న్నీటీ ప‌ర్యాంతమయ్యారు దివ్వ‌వాణి. దివ్వ‌వాణి క‌న్నీరు పెట్టుకోవ‌డం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతానని.. లౌక్యం ఏమాత్రం చేతకాదని అందుకే తనకు టీడీపీలో గుర్తింపు రాలేదని వాపోయారామె.