Aditi Rao Hydari : హిందీ వర్సెస్ సౌత్.. పనికిమాలిన చర్చలు అంటున్న అదితి..

తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అదితి ని సౌత్ వర్సెస్ హిందీ సినిమాలు గురించి అడగగా ఆసక్తిగా సమాధానం చెప్పింది.

Aditi Rao Hydari : హిందీ వర్సెస్ సౌత్.. పనికిమాలిన చర్చలు అంటున్న అదితి..

Aditi Rao Hydari comments on South Vs Hindi

Updated On : April 25, 2023 / 10:10 AM IST

Aditi Rao Hydari :  గత రెండేళ్లుగా సౌత్(South) వర్సెస్ బాలీవుడ్(Bollywood) అని చర్చలు సాగుతూనే ఉన్నాయి. సౌత్ సినిమాలు దేశమంతటా, ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ విజయాలు సాధించడంతో ఈ చర్చ వస్తూనే ఉంది. బాలీవుడ్ లో కొంతమంది ఇది పాజిటివ్ గా తీసుకుంటే మరికొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. అన్ని సినీ పరిశ్రమ నటీనటులు ఈ సౌత్ వర్సెస్ బాలీవుడ్ అనే చర్చపై ఎవరి కామెంట్స్ వారు చేస్తున్నారు.

తాజాగా ఈ అంశంపై హీరోయిన్ అదితి రావు హైదరి స్పందించింది. అదితి బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. గత కొంతకాలంగా సిద్దార్థ్ తో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తల్లో కూడా నిలుస్తుంది. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అదితి ని సౌత్ వర్సెస్ హిందీ సినిమాలు గురించి అడగగా ఆసక్తిగా సమాధానం చెప్పింది.

Aryan Khan : సొంత బిజినెస్ ప్రారంభించిన ఆర్యన్.. తనయుడి డైరెక్షన్ లో షారుఖ్ యాడ్

అదితి రావు హైదరీ మాట్లాడుతూ.. హిందీ వర్సెస్ సౌత్ సినిమా అని చర్చించుకోవడం అర్థరహితం. నా మనసులో అయితే అలాంటి బేధమేమి లేదు. నేను అన్ని చోట్ల సినిమాలు చేస్తున్నాను. మనం మన ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తున్నాము. సినిమాను ఏ భాషలో చేసినా దాని అంతిమ లక్ష్యం ప్రేక్షకులని అలరించడమే. మన దేశంలో రకరకాల సంస్కృతులు, భాషలు, ప్రతిభలు.. ఉన్నాయి. వాటిని చూసి మురిసిపోవాలి. వాటిని ప్రేక్షకులకు అందచేయడానికి ప్రయత్నించాలి. అంతే కానీ ఇలా సౌత్ వర్సెస్ బాలీవుడ్ అనే అక్కర్లేని చర్చలు అనవసరం. సౌత్ కూడా ఒక్కటే కాదు, సౌత్ లో నాలుగు సినీ పరిశ్రమలు ఉన్నాయి అని తెలిపింది.