Aryan Khan : సొంత బిజినెస్ ప్రారంభించిన ఆర్యన్.. తనయుడి డైరెక్షన్ లో షారుఖ్ యాడ్

ఆర్యన్ ఓ పక్క డైరెక్షన్ మీద దృష్టి పెడుతూనే మరోపక్క బిజినెస్ మీద కూడా దృష్టి సారించాడు. dyavol.X అనే బ్రాండ్ తో లగ్జరీ క్లాత్స్ బిజినెస్ ని ప్రారంభిస్తున్నాడు. లగ్జరీ స్ట్రీట్ వేర్ అనే నేపథ్యంలో తన క్లాత్స్ బ్రాండ్ ని ఆర్యన్ ప్రారంభిస్తున్నాడు.

Aryan Khan : సొంత బిజినెస్ ప్రారంభించిన ఆర్యన్.. తనయుడి డైరెక్షన్ లో షారుఖ్ యాడ్

Shahrukh Khan acted in Aryan Khan Direction

Updated On : April 25, 2023 / 9:47 AM IST

Aryan Khan :  షారుఖ్ తనయుడిగా ఆర్యన్ ఖాన్ అందరికి సుపరిచితమే. ఆర్యన్ ఖాన్ తండ్రి లాగే, అందరి బాలీవుడ్ స్టార్స్ పిల్లల్లాగే హీరోగా మారి నటనలోకి వస్తారనుకున్నారు. కానీ ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా మారి సినిమా తీయబోతున్నాను అంటూ కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు. త్వరలోనే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ లోపే ఆర్యన్ తన తండ్రి షారుఖ్ ని డైరెక్ట్ చేశాడు.

ఆర్యన్ ఓ పక్క డైరెక్షన్ మీద దృష్టి పెడుతూనే మరోపక్క బిజినెస్ మీద కూడా దృష్టి సారించాడు. dyavol.X అనే బ్రాండ్ తో లగ్జరీ క్లాత్స్ బిజినెస్ ని ప్రారంభిస్తున్నాడు. లగ్జరీ స్ట్రీట్ వేర్ అనే నేపథ్యంలో తన క్లాత్స్ బ్రాండ్ ని ఆర్యన్ ప్రారంభిస్తున్నాడు. త్వరలోనే ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. అయితే దీనికోసం ఓ స్పెషల్ యాడ్ షూట్ చేశాడు ఆర్యన్ ఖాన్. ఈ యాడ్ లో షారుఖ్ ఖాన్ నటించాడు. దీంతో తనయుడి డైరెక్షన్ లో షారుఖ్ యాడ్ చేశాడు. ఇటీవలే ఈ యాడ్ షూట్ పూర్తయింది. త్వరలోనే ఈ యాడ్ రిలీజ్ చేస్తాము అంటూ ఆర్యన్ తెలిపాడు.

This Week Movies : ఈ వారం థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలు ఇవే..

కొన్ని రోజుల క్రితమే షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఓ ఫేమస్ బ్యూటీ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైంది. ఇప్పుడు తనయుడు డైరెక్షన్ చేసేస్తున్నాడు. దీంతో పిల్లల విషయంలో షారుఖ్ చాలా ఆనందంగా ఉన్నాడట. సుహానాను అభినందిస్తూ ఇటీవల ఓ పోస్ట్ కూడా పెట్టాడు షారుఖ్. మరి ఆర్యన్ కి ఎప్పుడు స్పెషల్ పోస్ట్ పెడతాడో. ఇక షారుఖ్ అభిమానులు కూడా ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Aryan Khan (@___aryan___)