Adivi Sesh : 26/11… ముంబైలో నివాళులు అర్పించిన మేజర్..

26/11 ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో మేజర్ సినిమా ఇటీవలే తెరకెక్కి దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అడివిశేష్ ఇందులో సందీప్ ఉన్నికృష్ణన్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు. 26/11 ఉగ్రవాద దాడులు జరిగి .............

Adivi Sesh : 26/11… ముంబైలో నివాళులు అర్పించిన మేజర్..

Adivi Sesh paying tributes to 26/11 Immortal heroes in mumbai

Adivi Sesh :  26/11 ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో మేజర్ సినిమా ఇటీవలే తెరకెక్కి దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అడివిశేష్ ఇందులో సందీప్ ఉన్నికృష్ణన్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు. 26/11 ఉగ్రవాద దాడులు జరిగి పధ్నాలుగేళ్ళు గడిచింది.

Kamal Haasan : నేను బాగానే ఉన్నాను.. మరీ ఎక్కువ ప్రచారం చేసేస్తున్నారు..

ఈ నేపథ్యంలో అడివి శేష్, సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లితండ్రులతో కలిసి ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడి పోలీసులతో కూడా మాట్లాడారు. సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లితండ్రులతో కూడా కాసేపు సమయాన్ని వెచ్చించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.