Agnipath : ఆర్మీ జవాన్‌ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి

ఆర్మీ జవాన్‌ కావాలని కలలుకన్న వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు రాకేశ్ ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి చెందాడు. ఆర్మీ జవాన్ కావాలన్న అతని కల నెరవేరకుండాను ఆందోళనలో అశువులుబాసాడు.

Agnipath : ఆర్మీ జవాన్‌ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి

Agneepath Scheme Secunderabad

Protest against Agnipath: ఆర్మీ జవాన్ కావాలని కలలు కన్న యువకుడు త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ స్కీమ్ ఆందోళనల్లో అసువులుబాసాడు. బీఎస్ఎఫ్ లో పనిచేస్తున్న తన సోదరిని స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవ చేయాలని ఆర్మీలో జవాన్ కావాలని ఎన్నో కలలు కన్న రామోదరం రాకేశ్ అనే యువకుడు సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తూటాలకు అతని నూరేళ్ల జీవితం ఛిద్రమైపోయింది. ఆందోళనల్లో అతని భవిష్యత్తు కాలి బూడిదైపోయింది.

Also read : Andhra pradesAgnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాల ప్రక్రియ షురూ..h : ’క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర‘తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు : చంద్రబాబు

త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ స్కీమ్ ను వత్యిరేకిస్తు వెల్లువెత్తిన ఆందోళనల్లో భాగంగా సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసకాండలో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ పోలీసుల కాల్పుల్లో బుల్లెట్‌ తగలడంతో చనిపోయాడు. రాకేశ్ స్వస్థలం వరంగల్ జిల్లా దబిడిపేట. కొన్నాళ్లుగా రాకేశ్ ఆర్మీ పోలీస్ శిక్ష పొందుతున్నాడు. బీఎస్ఎఫ్ లో పనిచేస్తున్న సోదరి రాణిని చూసి రాకేశ్ స్ఫూర్తి పొందాడు.దేశానికి సేవ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆర్మీ పోలీసు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈక్రమంలో అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించటం నాలుగు ఏళ్ల పాటు మాత్రమే ఆర్మీలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందని నిబంధనతో రాకేశ్ తీవ్రంగా నిరాశచెందాడు. తన కన్నకలలు కల్లలు అయిపోయాయని తీవ్ర ఆవేదన చెందాడు. రాకేశ్ లాగానే దేశ వ్యాప్తంగా ఉన్న యువత కూడా అగ్నిపథ్ పథకం ప్రకటన తరువాత తీవ్ర నిరాశ చెందారు. ఆందోళనలకు చేపట్టారు.

Also read : Agnipath Scheme: ‘అగ్నిపథ్‌’ స్కీమ్‌ను అర్థం చేసుకోండి..ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం : మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌..

ఈ ఆందోళనల్లోనే రాకేష్‌ చనిపోయాడన్న వార్తతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. వరంగల్‌ జిల్లా దబ్బీర్‌ పేట గ్రామానికి చెందిన రాకేష్‌.. ఆర్మీ జవాన్‌ కావాలని కలలు కన్నాడు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో నిబంధనలు మార్చడంతో.. ఈరోజు సికింద్రాబాద్‌ స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్నాడు. అక్కడ పోలీసుల కాల్పుల్లో చనిపోవడంతో అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు.

Also read : Minister Kishan Reddy: ’అగ్నిపథ్‌‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..

రాకేశ్ సోదరి సంగీత కూడా అర్మీ జవాన్‌గానే పనిచేస్తున్న ఆమె BSF జవాన్‌గా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో డ్యూటీ నిర్వహిస్తున్నారు. అక్క ప్రోత్సాహంతోనే ఆర్మీలో చేరాలని కఠోర సాధన చేశాడు రాకేశ్. హైదరాబాద్ కు మూడు రోజుల క్రితం వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.