Agniveer: భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ‘అగ్నిప‌థ్’ నియామ‌కాల‌ మొట్ట‌మొద‌టి ప‌రీక్ష‌ షురూ

'అగ్నిప‌థ్' ప‌థ‌కం కింద నియామ‌కాల కోసం మొట్ట‌మొద‌టి ప‌రీక్ష ఇవాళ‌ ప్రారంభ‌మైంది. అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని హైద‌రాబాద్ స‌హా దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు దిగి, విధ్వంసానికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ కేంద్ర స‌ర్కారు దీనిపై వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇవాళ భార‌తీయ వైమానిక ద‌ళంలో నియామ‌కాల కోసం జ‌రుగుతోన్న మొట్ట‌మొద‌టి ప‌రీక్ష‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Agniveer: భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ‘అగ్నిప‌థ్’ నియామ‌కాల‌ మొట్ట‌మొద‌టి ప‌రీక్ష‌ షురూ

Agniveer Iaf

Agniveer: ‘అగ్నిప‌థ్’ ప‌థ‌కం కింద నియామ‌కాల కోసం మొట్ట‌మొద‌టి ప‌రీక్ష ఇవాళ‌ ప్రారంభ‌మైంది. అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని హైద‌రాబాద్ స‌హా దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు దిగి, విధ్వంసానికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ కేంద్ర స‌ర్కారు దీనిపై వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇవాళ భార‌తీయ వైమానిక ద‌ళంలో నియామ‌కాల కోసం జ‌రుగుతోన్న మొట్ట‌మొద‌టి ప‌రీక్ష‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇవాళ‌ ఢిల్లీ, కాన్పూర్, పట్నాలోని ప‌లు ప్రాంతాల్లో ఈ ప‌రీక్ష జ‌రుగుతోంది.

నేటి నుంచి ఈ నెల 31 మ‌ధ్య‌ దేశ వ్యాప్తంగా ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌న‌ప‌డుతున్నాయి. అన్ని ప‌రీక్షా కేంద్రాల్లో సీసీటీవీల‌తో పాటు డ్రోన్ల‌తో నిఘా ఏర్పాటు చేశారు. ఇవాళ మూడు షిఫ్టుల్లో ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. మొత్తం 31,875 మంది అభ్య‌ర్థులు నేడు ప‌రీక్ష రాయాల్సి ఉంది. అగ్నివీర్ నియామ‌క ప‌థ‌కం కింద భార‌త వైమానిక ద‌ళానికి 7,49,899 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం జూన్ 14న కేంద్ర కేబినెట్ అగ్నిప‌థ్ ప‌థ‌కానికి ఆమోద‌ముద్ర వేసింది.

COVID19: దేశంలో 1,52,200కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌