Airtel 5G Services in India : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. కొత్తగా చేరిన మరో నగరం.. ఎక్కడో తెలుసా?
Airtel 5G Services in India : భారత్‌లో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు తమ 5G సర్వీసుల (5G Services in India)ను నెమ్మదిగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.

Airtel 5G Services in India _ Airtel rolls out its 5G services in Shimla
Airtel 5G Services in India : భారత్‌లో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు తమ 5G సర్వీసుల (5G Services in India)ను నెమ్మదిగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను ప్రధాన నగరాల్లో ప్రారంభించాయి. లేటెస్టుగా ఎయిర్‌టెల్ 5G సర్వీసులను నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది. అందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఎయిర్‌టెల్ తన 5G సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది.
ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు (Airtel 5G Plus Services) దశలవారీగా యూజర్లకు అందుబాటులో ఉంటాయని టెల్కో తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రకారం.. ఐదవ జనరేషన్ మొబైల్ సిస్టమ్ (5G)-రెడీ డివైజ్‌లను కలిగిన కస్టమర్లకు మరింత అందించనుంది. దాంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా హై-స్పీడ్ ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు.
ఈ Airtel 5G సర్వీసులు ప్రస్తుతం మాల్ రోడ్, సంజోలి, ధల్లి, భట్టాకుఫర్, రిడ్జ్, సంజోలి హెలిప్యాడ్ ప్రాంతాలతో పాటు మరికొన్ని ఎంపిక చేసిన ప్రదేశాలలో పనిచేస్తున్నాయని సర్వీస్ ప్రొవైడర్ పేర్కొంది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను నెమ్మదిగా విస్తరిస్తూ.. నిర్ణీత సమయంలో సిటీ అంతటా 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపింది.

Airtel 5G Services in India _ Airtel rolls out its 5G services in Shimla
ఎయిర్‌టెల్ ఎగువ నార్త్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పుష్పిందర్ సింగ్ గుజ్రాల్ లాంచ్ మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్ కస్టమర్లు ఇప్పుడు అల్ట్రాఫాస్ట్ (Ultra Fast) నెట్‌వర్క్‌ను పొందవచ్చు. ప్రస్తుత 4G స్పీడ్ కన్నా 20-30 రెట్లు ఎక్కువ స్పీడ్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ కస్టమర్‌లు హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపుల్ చాటింగ్, ఫోటోల ఇన్‌స్టంట్ అప్‌లోడ్ మరిన్నింటికి సూపర్‌ఫాస్ట్ యాక్సెస్‌ను అనుమతిస్తుందని గుజ్రాల్ జోడించారు.
మరోవైపు.. భారతీ ఎంటర్‌ప్రైజెస్ (ఎయిర్‌టెల్) వైస్ చైర్మన్ రాకేష్ భారతీ మిట్టల్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా డేటా సెంటర్, డిజిటల్ బ్యాంకింగ్, వృత్తి విద్య కోసం యూపీలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది.
రాష్ట్రంలో డిజిటల్ ఇండియా మిషన్ అమలుతో పాటు కమ్యూనికేషన్ సౌకర్యాల మెరుగుదల, భారతీ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించినట్లు సీఎం కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో, సీఎం యోగి ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి నగరంలో ప్రతి పౌరుడు విద్య, ఆరోగ్య సేవలను పొందాలనేది తమ ప్రయత్నమన్నారు. న్యూ ఉత్తరప్రదేశ్, నూతన భారత్‌కు ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా మిషన్ ఒక ముఖ్యమైన పునాది రాయిగా పేర్కొన్నారు. యూపీలోని మారుమూల గ్రామాలకు ఈ రోజు పేపర్‌లెస్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు సీఎం తెలిపారు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..