Airtel Cricket Prepaid Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో బెనిఫిట్స్..!
Airtel Cricket Prepaid Plans : భారతీ ఎయిర్‌టెల్ వార్షిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సబ్‌స్క్రిప్షన్‌తో క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్ (Cricket Prepaid Plans)లను సవరించింది. టెలికాం టాక్ ప్రకారం.. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ క్రికెట్ కొత్త ప్లాన్‌లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.

Airtel revamps Cricket prepaid plans with Amazon Prime Video subscription_ Prices, benefits
Airtel Cricket Prepaid Plans : భారతీ ఎయిర్‌టెల్ వార్షిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సబ్‌స్క్రిప్షన్‌తో క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్ (Cricket Prepaid Plans)లను సవరించింది. టెలికాం టాక్ ప్రకారం.. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ క్రికెట్ కొత్త ప్లాన్‌లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌ల ద్వారా ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను కొనుగోలు చేయవచ్చు. ఎయిర్‌టెల్ క్రికెట్ ప్యాక్ (Airtel Cricket Pack)లో వరుసగా రూ. 699, రూ. 999, రూ. 2999, రూ. 3359 టారిఫ్‌లతో నాలుగు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.
టాప్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒక ఏడాది పాటు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ క్రికెట్ సిరీస్ (India vs New zealand)ను ప్రైమ్ వీడియో (Prime Video)లో ఇష్టపడే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఎయిర్‌టెల్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని Airtel క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రోమింగ్ కాల్‌లతో పాటు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్‌లను అందిస్తాయి. ఈ ప్లాన్ల వ్యాలిడిటీ వ్యవధితో పాటు రోజువారీ ఇంటర్నెట్ డేటా పరంగా విభిన్నంగా ఉంటాయి.

Airtel revamps Cricket prepaid plans with Amazon Prime Video subscription_ Prices, benefits
ఇక ఎయిర్‌టెల్ బేస్ ప్లాన్, రూ. 699 (పన్నులు లేకుండా), రోజుకు 3GB ఇంటర్నెట్ డేటా, Airtel Xstream మొబైల్ ప్యాక్‌ను అందిస్తుంది. 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ. 999 విలువైన ప్రీపెయిడ్ ప్లాన్, మరోవైపు, 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2.5GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. మొబైల్‌లో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ లైబ్రరీకి యాక్సెస్‌ను కూడా కలిగి ఉంటుంది.
రూ. 2,999, రూ. 3,359 టారిఫ్‌లతో ఎయిర్‌టెల్ క్రికెట్ ప్లాన్‌లు రెండూ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రోజుకు 2GB డేటా, ఫాస్టాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, అపోలో 24/7 సభ్యత్వాన్ని అందిస్తుంది. వైద్యులకు యాక్సెస్, మందులపై క్యాష్‌బ్యాక్, ఉచిత హోమ్ డెలివరీ, డాక్టర్ కన్సల్టేషన్‌లు, డయాగ్నోస్టిక్‌లపై తగ్గింపు వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. అదే బెనిఫిట్స్ రూ. 3,359 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందుబాటులో ఉన్నాయి. రూ. 499 విలువైన వార్షిక డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌ను కూడా కలిగి ఉంది. రోజుకు 2.5GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది.

Airtel revamps Cricket prepaid plans with Amazon Prime Video subscription
ఎయిర్‌టెల్ (Airtel) రీస్టోర్ చేసిన క్రికెట్ ప్లాన్‌లతో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఇప్పుడు కొనసాగుతున్న ఇండియా Vs న్యూజిలాండ్ క్రికెట్ సిరీస్‌ను ప్రసారం చేస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ తమ కస్టమర్లలో ఎక్కువ మందిని ఆన్‌బోర్డ్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది.
మీరు టాప్ రేంజ్ ప్లాన్ కోసం చూస్తుంటే.. Disney+ Hotstar మొబైల్ ప్లాన్ EPL ఫుట్‌బాల్, F1 వంటి మరిన్ని లైవ్ స్పోర్ట్స్ ప్రొగ్రామ్‌లకు యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న FIFA 2022 ప్రపంచ కప్‌ను లైవ్ టెలిక్యాస్ట్ చేసే హక్కు OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఏదీ లేదు. అందుకే వినియోగదారులు Jio సినిమాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. FIFA 2022 వరల్డ్ కప్‌ను కూడా ఫ్రీగా వీక్షించవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..