Vi Port Jio-Airtel : వోడాఫోన్ ఐడియా యూజర్లకు అలర్ట్.. Vi నుంచి ఎయిర్‌టెల్, జియోకు మీ నంబర్ పోర్టు చేసుకోవచ్చు!

Vi Port Jio-Airtel : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్.. ఇప్పటికే దేశంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G సర్వీసులను మరిన్ని భారతీయ నగరాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

Vi Port Jio-Airtel : వోడాఫోన్ ఐడియా యూజర్లకు అలర్ట్.. Vi నుంచి ఎయిర్‌టెల్, జియోకు మీ నంబర్ పోర్టు చేసుకోవచ్చు!

How to port Vodafone number to Jio, Airtel

Vi Port Jio-Airtel : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్.. ఇప్పటికే దేశంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G సర్వీసులను మరిన్ని భారతీయ నగరాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

రెండు టెలికాం దిగ్గజాలు తమ యూజర్లకు హైస్పీడ్, ఐదవ జనరేషన్ నెట్‌వర్క్ బెనిఫిట్స్ అందించడానికి రెండు సంవత్సరాలలోపు పాన్ ఇండియా దిశగా విస్తరించనున్నాయి. అయితే, భారత మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (Vi) మాత్రం 5G రేసులో వెనుకబడి ఉంది. Vodafone Idea 5G సర్వీసుల కోసం ఎలాంటి ప్రారంభ తేదీని ప్రకటించలేదు.

నివేదికల ప్రకారం.. నిధుల సమస్యల కారణంగా కంపెనీ కొంచెం ఆలస్యం కావచ్చు. మీరు Vi యూజర్లు అయితే 5G సర్వీసులను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ, మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. మీ SIMని Jio, Airtelకి పోర్ట్ చేయవచ్చు. Vi యూజర్లు మొబైల్ నంబర్‌ని అలాగే ఉంచుకొని వోడాఫోన్ నుంచి జియో లేదా ఎయిర్‌టెల్‌కి సులభంగా మారవచ్చు.

How to port Vodafone number to Jio, Airtel

How to port Vodafone number to Jio, Airtel

Vi SIM మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) అన్ని నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉంది. ఈ ప్రక్రియ ఆన్‌లైన్ సులభంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ఒకే టెలికాం ఆపరేటర్‌లోని పోర్టింగ్ నంబర్‌లను ధృవీకరించడానికి దాదాపు 3 రోజులు పడుతుంది. వేర్వేరు ఆపరేటర్‌లకు పోర్ట్ చేసేందుకు 5 రోజులు పడుతుంది. మీ ప్రస్తుత Vi SIMని Jio లేదా Airtelకి ఎలా పోర్ట్ చేయాలో వివరంగా చూద్దాం..

Vi  SIMని జియోకి పోర్ట్ చేయడం ఎలా? :
* మీ ప్రస్తుత మొబైల్ నంబర్ నుంచి PORT <10-అంకెల మొబైల్ నంబర్> అని 1900కి SMS పంపండి.
* మీరు పోర్ట్ చేయాలనుకునే మొబైల్ నంబర్‌ను పంపండి.
* మీరు UPC కోడ్, గడువు తేదీ గురించి Vodafone Idea నెట్‌వర్క్ నుంచి SMSను అందుకుంటారు.
* ఆ తర్వాత, UPC (యూనిక్ పోర్టింగ్ కోడ్)తో మీ సమీప Jio స్టోర్ లేదా Jio రిటైలర్‌కి వెళ్లండి.
* MNP రిక్వెస్ట్ ఉంచడానికి మీరు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఒరిజినల్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) / ఐడెంటిటీ ప్రూఫ్ (POI) డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి.
* డాక్యుమెంట్‌లను సమర్పించిన తర్వాత, జియో ఎగ్జిక్యూటివ్ మీ పోర్టింగ్ ప్రక్రియను కొనసాగించవచ్చు.
* 5 రోజుల్లో SIM యాక్టివేషన్ పూర్తవుతుంది.
* మీరు మీ పాత Vodafone Idea నంబర్‌తో కొత్త Jio SIMని పొందవచ్చు.

How to port Vodafone number to Jio, Airtel

How to port Vodafone number to Jio, Airtel

వోడాఫోన్ ఐడియా SIMని ఎయిర్‌టెల్‌కి పోర్ట్ చేయడం ఎలా :

– 1900కి SMS పంపిన తర్వాత UPC (యూనిక్ పోర్టింగ్ కోడ్) అందుకున్నాక మీ సమీపంలోని Airtel స్టోర్‌ని విజిట్ చేయండి.
– యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయడంలో Airtel సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు మీకు సాయం చేస్తారు.
– డాక్యుమెంట్ ధ్రువీకరణ తర్వాత.. కనీస పోర్టింగ్ ఫీజు చెల్లించండి. మీరు కొత్త Airtel SIM కార్డ్ పొందవచ్చు.
– కొత్త సిమ్ 5 రోజుల్లో యాక్టివేట్ అవుతుంది.

మీరు పోర్టింగ్ ప్రాసెస్‌కు ముందు పోస్ట్‌పెయిడ్ సర్వీసును ఉపయోగిస్తున్నారా? Vodafone Ideaతో అన్ని బకాయిలను క్లియర్ చేయాలనే విషయాన్ని యూజర్లు తప్పక గమనించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vodafone Idea Users : అతి త్వరలో వోడాఫోన్ ఐడియా యూజర్లకు 5G సర్వీసులు.. గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా