Vodafone Idea Users : అతి త్వరలో వోడాఫోన్ ఐడియా యూజర్లకు 5G సర్వీసులు.. గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా

Vodafone Idea Users : దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) అతి త్వరలో భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమార్ మంగళం బిర్లా ఈ రోజు జరిగిన 6వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్‌లో ధృవీకరించారు.

Vodafone Idea Users : అతి త్వరలో వోడాఫోన్ ఐడియా యూజర్లకు 5G సర్వీసులు.. గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా

Vodafone Idea users will get 5G services very soon, says Kumar Mangalam Birla

Vodafone Idea Users : దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) అతి త్వరలో భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమార్ మంగళం బిర్లా ఈ రోజు జరిగిన 6వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్‌లో ధృవీకరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ 5G సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలికాం పరిశ్రమ 1.3 బిలియన్ల భారతీయులు ఉన్నారని, అనేక వేల సంస్థల డిజిటల్ కలలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు దేశంలో 5G సర్వీసులను ప్రారంభించినట్టు తెలిపారు. డిజిటల్ ఎకానమీ ద్వారానే ట్రిలియన్ డాలర్ల సహకారంతో రాబోయే కొద్ది సంవత్సరాల్లో దేశంలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఇదో వేదికగా పేర్కొన్నారు.

వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం 240 మిలియన్ల యూజర్లు కలిగి ఉందని, అందులో 50 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతానికి, టెలికాం ఆపరేటర్ భారత మార్కెట్లో 5Gని ఎప్పుడు లాంచ్ చేయాలనే దానిపై ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు ఎయిర్‌టెల్ (Airtel) 8 నగరాల్లో ఈరోజు 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.

Vodafone Idea users will get 5G services very soon, says Kumar Mangalam Birla

Vodafone Idea users will get 5G services very soon, says Kumar Mangalam Birla

కంపెనీ చైర్మన్, సునీల్ మిట్టల్, అన్ని నగరాల పేర్లను వెల్లడించలేదు, కానీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, వారణాసికి ఈరోజు 5G అందుబాటులోకి వస్తుందని ఆయన ధృవీకరించారు. మార్చి 2024 నాటికి భారత్ అంతటా 5G అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో (Reliance Jio) దీపావళి నాటికి 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.

జియో 5G ప్లాన్‌లు ప్రపంచంలోని ఇతర టెలికాం సేవలతో పోల్చితే.. భారత్‌లో అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని RIL చైర్మన్ ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. డిసెంబర్ 2023 నాటికి అన్ని నగరాలు, గ్రామాల్లో జియో 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అంబానీ ప్రకటించారు.

5G నెట్‌వర్క్ సర్వీసులను పెంచుతుందని, పరిశ్రమ 4.0, కనెక్టవిటీతో ఫ్యాక్టరీ స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ఆటోమొబైల్స్, స్మార్ట్ హోమ్‌లు, గేమింగ్ ఇతర వ్యాపార, వినియోగదారు పరిష్కారాలను రూపొందించడానికి ఆటోమేటెడ్ తయారీ వంటి క్లిష్టమైన రంగాలలో పెద్ద ప్రభావాన్ని కలిగిస్తుందని అంబానీ అన్నారు. జియో 5G సర్వీసులు గ్రామీణ భారతదేశంలో వృద్ధి, విద్య, రిమోట్ హెల్త్, స్మార్ట్ వ్యవసాయాన్ని వేగవంతం చేయడంలో సాయపడతాయని అంబానీ తెలిపారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vodafone Free Offer : వోడాఫోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా మీకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ పొందవచ్చు.. ఇదిగో ప్రాసెస్!