Drishyam 2: బాలీవుడ్‌కు బూస్ట్ ఇచ్చిన దృశ్యం-2.. వందకోట్లకు పరుగులు పెడుతున్న అజయ్ దేవ్గన్!
హీరో అజయ్ దేవ్గన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం-2’ ఎట్టకేలకు బాలీవుడ్ బాక్సాఫీస్‌కు బూస్ట్ ఇచ్చింది. మలయాళ ‘దృశ్యం-2’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులకు అలరించడంతో, ఈ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Drishyam 2: హీరో అజయ్ దేవ్గన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం-2’ ఎట్టకేలకు బాలీవుడ్ బాక్సాఫీస్‌కు బూస్ట్ ఇచ్చింది. మలయాళ ‘దృశ్యం-2’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులకు అలరించడంతో, ఈ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Drishyam 2: పాఠాలు నేర్పుతున్న దృశ్యం-2 సక్సెస్.. మనవాళ్లు తప్పు చేశారా?
గతకొంత కాలంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి సినిమా కూడా ఫెయిల్ అవుతూ వస్తుండగా, అజయ్ దేవ్గన్ దృశ్యం-2 మూవీ మాత్రం అదరగొడుతోంది. ఈ సినిమాకు వీకెండ్‌లోనే కాకుండా వీక్ డేస్‌లోనూ ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మంగళవారం రోజున కూడా ఈ సినిమా ఏకంగా రూ.10.5 కోట్లు వసూళ్లు సాధించి వావ్ అనిపించింది.
మంగళవారం వసూళ్లతో దృశ్యం-2 సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే రూ.86 కోట్ల వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ సరసన స్టార్ బ్యూటీ శ్రియా సరన్ హీరోయిన్‌గా నటించగా, టబు మరోముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమాను అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేశారు.