Ajith Kumar : నయన్ ప్రియుడి దర్శకత్వంలో అజిత్ నెక్స్ట్ సినిమా..

అజిత్ 62వ సినిమాని నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు. అజిత్ 62వ సినిమాని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్....

Ajith Kumar : నయన్ ప్రియుడి దర్శకత్వంలో అజిత్ నెక్స్ట్ సినిమా..

Ajith

Ajith Kumar :  తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే అజిత్ 60వ సినిమా ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవ్వగా తమిళ్ లో సక్సెస్ సాధించినా మిగిలిన భాషల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాని హెచ్ వినోద్ తెరకెక్కించారు.

అయితే అజిత్ 61వ సినిమా కూడా ఇతనే డైరెక్ట్ చేయనున్నాడు. ‘వలిమై’ సినిమా టైంలోనే అజిత్ కి మరో కథ చెప్పి ఒప్పించాడు వినోద్. అది కూడా ‘వలిమై’ సినిమా నిర్మించిన బోని కపూర్ నిర్మాణంలోనే ఉండబోతున్నది. అజిత్ 61వ సినిమా ఇంకా మొదలవ్వకముందే తాజాగా అజిత్ 62వ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ నుంచి పెన్నీ సాంగ్ ప్రోమో.. సితార స్పెషల్ ఎంట్రీ

అజిత్ 62వ సినిమాని నయనతార ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు. అజిత్ 62వ సినిమాని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు తెలియచేశారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలోనే నయనతార అజిత్ తో కలిసి పలు సినిమాల్లో నటించింది. మరి ఈ సినిమాకి నయన్ ప్రియుడు డైరెక్టర్ కావడంతో ఈ సినిమాలో కూడా నయనతార నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.