Ajith: వంద కోట్ల అజిత్.. సత్తా చూపిన తమిళ హీరో!

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ మూవీ ‘వలిమై’ ఇటీవల రిలీజ్ అయ్యి తమిళనాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది....

Ajith: వంద కోట్ల అజిత్.. సత్తా చూపిన తమిళ హీరో!

Ajith Remuneration 100 Cr

Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ మూవీ ‘వలిమై’ ఇటీవల రిలీజ్ అయ్యి తమిళనాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. అయితే తెలుగునాట ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమాకు అదిరిపోయే రిజల్ట్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే ఓకే చేసిన అజిత్, తాజాగా మరోసారి తన సత్తా చాటారు.

Valimai: ఓటీటీలో అజిత్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇండియన్ సినిమా రంగంలోని స్టార్ హీరోల్లో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఈ లిస్ట్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. తాజాగా తమిళం నుండి అజిత్ ఈ జాబితాలో చేరారు. ఈ హీరో నటించబోయే నెక్ట్స్ మూవీకి గాను ఏకంగా రూ.105 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో అజిత్ తన 62వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకు అజిత్ ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుండటం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుండటంతో అజిత్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

Ajith Shalini: వైఫ్‌తో తలా బ్లూలైట్ రొమాన్స్.. వైరల్‌గా మారిన ఫోటోలు!

ఇక అజిత్ ఈ సినిమాతో మరోసారి కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా తమిళంలో అజిత్, విజయ్‌ల మధ్య భారీ పోటీ నెలకొంటుందనే విషయం తెలిసిందే. దీంతో రెమ్యునరేషన్ విషయంలోనూ ఈ ఇద్దరు హీరోల మధ్య వార్ నడుస్తుందని వారి అభిమానులు అంటున్నారు.