Ajith Shalini: వైఫ్‌తో తలా బ్లూలైట్ రొమాన్స్.. వైరల్‌గా మారిన ఫోటోలు!

కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ టూ నార్త్ వరకు యాక్షన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సౌత్ సూపర్ స్టార్ అజిత్ కుమార్. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్ డంతో తలా అజిత్..

Ajith Shalini: వైఫ్‌తో తలా బ్లూలైట్ రొమాన్స్.. వైరల్‌గా మారిన ఫోటోలు!

Ajith Shalini

Ajith Shalini: కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ టూ నార్త్ వరకు యాక్షన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సౌత్ సూపర్ స్టార్ అజిత్ కుమార్. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్ డంతో తలా అజిత్, దళపతి విజయ్ పోటీపడుతుంటారు. అంత పెద్ద స్టార్ అయినా అజిత్ మాత్రం ఎప్పుడూ తన స్టార్ డం కనిపించేలా ప్రవర్తించడు. అజిత్ భార్య షాలినీ కూడా అంతే. సెలబ్రిటీలంటే పార్టీలు.. ఎక్కడ ఉన్నా హంగామా చాలా సహజం. కానీ ఈ జంట మాత్రం పెళ్లి తర్వాత పెద్దగా కెమెరాల కంట పడింది కూడా లేదు. కానీ, ఇప్పుడు ఈ జంట రొమాన్స్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Ajith Kumar : నయన్ ప్రియుడి దర్శకత్వంలో అజిత్ నెక్స్ట్ సినిమా..

ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన తమిళ సినిమా `అమర్కాలం`లో తొలిసారి అజిత్ షాలిని జంటగా నటించారు. ఈ మూవీనే తెలుగులో అద్భుతం పేరుతో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సక్సెస్ అయింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లికి దారి తీసింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి, పిల్లల పెంపకంతో బిజీగా ఉన్న షాలినీ బయట కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువే. అయితే, ఇప్పుడు ఈ జంటకి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Ajith : 22 ఏళ్ళ తర్వాత అజిత్-టబు కాంబినేషన్లో సినిమా

బ్లూ కరల్ లైటింగ్ లో అజిత్ వైఫ్ షాలినినీ హగ్ చేసుకొని కిస్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ ఫోటో ఎక్కడో ప్రైవేట్ పార్టీకి చెందినదిగా భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ స్టార్ కపుల్ ఇలా రొమాంటిక్ ఫోటో నెట్టింట సందడి చేయడం ఇదే తొలిసారి కావడంతో అజిత్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారట. 23 సంవత్సరాల కలయిక అనేలా సోషల్ మీడియాలో షాలిని పోస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే అజిత్ కు కానీ.. షాలినీకి కానీ సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి అఫీషియల్ అకౌంట్స్ ఉండవు.