Agent Movie: కొత్త సంవత్సరం రోజున కొత్త రిలీజ్ డేట్‌తో వస్తున్న ఏజెంట్..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Agent Movie: కొత్త సంవత్సరం రోజున కొత్త రిలీజ్ డేట్‌తో వస్తున్న ఏజెంట్..?

Akhil Akkineni Agent Movie To Give New Release Date On New Year Day

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Agent Movie: ఎండాకాలమే బెస్ట్ అంటోన్న ఏజెంట్.. నిజమేనా..?

కాగా, ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేస్తామని పలుమార్లు చెప్పుకొచ్చిన చిత్ర యూనిట్, ఇప్పటివరకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ సినిమా ఎందుకు ఆలస్యమవుతుందా అని వారు చిత్ర యూనిట్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగానే ఈ సినిమా రిలీజ్ వరుసగా వాయిదా పడుతూ వస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Akhil Agent Movie: సంక్రాంతిని సీనియర్లకే వదిలేస్తున్న అయ్యగారు.. ఇక ఉగాదే పక్కా..?

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు పోటీపడుతుండటంతో అఖిల్ తన సినిమా రిలీజ్‌ను మరోసారి వాయిదా వేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు అఖిల్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. నూతన సంవత్సరం రోజున ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా కొత్త రిలీజ్ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి అంటున్నారు అభిమానులు.