Alia Bhatt : బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ బ్రేక్ చేసిన పఠాన్.. అలియా ఏముందో తెలుసా?

పఠాన్ ఇప్పటికే పలు సినిమాల రికార్డులని బద్దలు కొట్టి కొత్త రికార్డులని సెట్ చేస్తుంది. తాజాగా అలియా భట్ పఠాన్ సినిమా బ్రహ్మాస్త్ర రికార్డుని బీట్ చేయడంపై మాట్లాడింది.............

Alia Bhatt : బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ బ్రేక్ చేసిన పఠాన్.. అలియా ఏముందో తెలుసా?

Alia Bhatt reacts on pathaan collections beating her Brahmastra movie

Alia Bhatt :  షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా మొదటి నుంచి కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఆరు రోజుల్లో 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 300 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇటీవలే సక్సెస్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు చిత్ర యూనిట్.

పఠాన్ సక్సెస్ పై బాలీవుడ్ అంతా సంతోషంగా ఉంది. గత సంవత్సర కాలంగా నిరాశలో ఉన్న బాలీవుడ్ కి పఠాన్ ఊపిరి పోయడంతో బాలీవుడ్ అంతా పఠాన్ కి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు. పఠాన్ సక్సెస్ ని అందరూ అభినందిస్తున్నారు. పఠాన్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. పఠాన్ ఇప్పటికే పలు సినిమాల రికార్డులని బద్దలు కొట్టి కొత్త రికార్డులని సెట్ చేస్తుంది. తాజాగా అలియా భట్ పఠాన్ సినిమా బ్రహ్మాస్త్ర రికార్డుని బీట్ చేయడంపై మాట్లాడింది.

Kartik Aryan : షారుఖ్ పఠాన్ కలెక్షన్స్ కోసం రిలీజ్ ని వాయిదా వేసుకున్న మరో స్టార్ హీరో..

బ్రహ్మాస్త్ర సినిమా 250 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధిస్తే పఠాన్ సినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధించి మరిన్ని కలెక్షన్స్ కోసం దూసుకుపోతుంది. తాజాగా బాలీవుడ్ లో ఓ ఈవెంట్ లో పాల్గొన్న అలియా భట్ దీనిపై మాట్లాడుతూ.. ప్రతి సినిమా ఇంకో సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. పఠాన్ వంటి చిత్రం కేవలం బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకే అతిపెద్ద బ్లాక్ బస్టర్. మనందరికీ ఈ సినిమా విజయం స్ఫూర్తిదాయకం అని తెలిపింది. బాలీవుడ్ కి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పఠాన్ సినిమా లాంటి పెద్ద హిట్ రావడంతో బాలీవుడ్ అంత కుడా పఠాన్ ని అభినందిస్తూ మరింత ప్రమోట్ చేయడానికి చూస్తున్నారు.