Telangana Govt Schools: ఇక తెలంగాణలో అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియమే

ఇకపై తెలంగాణలోని అన్ని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 నుంచే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం....

Telangana Govt Schools: ఇక తెలంగాణలో అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియమే

Cm Kcr

Telangana Govt Schools: ఇకపై తెలంగాణలోని అన్ని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 నుంచే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం రెగ్యూలేట్ చేయనున్నారు. సోమవారం అధికారికంగా సీఎం కేసీఆర్ నివాసంలో భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీకి ఆమెదం తెలిపింది కేబినెట్. ఈ కమిటీలో కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు.

ఇదే మీటింగ్ లో మన ఊరు మన బడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రూ.7వేల 289కోట్లు వెచ్చించి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు.

ఇది కూడా చదవండి : చింతామణి నాటకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం

‘గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంకు పంపడానికి రెుడీగా ఉన్నారు. అందుకే కేబినెట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంను తప్పక బోధించాలని సూచించింది’ అని స్టేట్మెంట్ ఇచ్చారు.

దాంతో పాటుగా టీచర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి.. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ విద్యను అందించే ప్రయత్నం చేయనుంది ప్రభుత్వం. పరిసరాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు శుభ్రంగా ఉండేలా మధ్యాహ్న భోజనం అందేలా ఏర్పాట్లు చేయనున్నారు.