TRS MLAs Trap Case : దేశ వ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిపైనా సీబీఐ విచారణ జరిపించాలి : భట్టి

తెలంగాణలో ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఈ తీర్పుపై టీ కాంగ్రెస్ హర్షం వ్యక్తంచేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీ కాంగ్రెస్ స్వాగతించింది. దీని గురించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారేవారిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

TRS MLAs Trap Case : దేశ వ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిపైనా సీబీఐ విచారణ జరిపించాలి : భట్టి

TRS MLAs Trap Case

TRS MLAs Trap Case : తెలంగాణలో ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై టీ కాంగ్రెస్ హర్షం వ్యక్తంచేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు గురించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది జుగుప్సాకరంగా ఉందని ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారేవారిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేలు,ఎంపీలపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం హైకోర్టు సీబీఐకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు భట్టి.పార్టీల ఫిరాయింపులు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని..పార్టీ ఫిరాయింపుల వ్యవహారం జుగుస్పాకరంగా మారిందని ఏవగించుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ప్రజల తీర్పును అవమానించటమేనన్నారు.ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చట్టాన్ని ఖాతరు చేయకుండా అధికార పార్టీలోకి చేర్చుకుంటున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. దేశం మొత్తం లో పార్టీ మారిన వారందరిపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు.
ఇటువంటి వ్యవహారాలకు పుల్ స్టాఫ్ పడాలంటే… పార్టీ మారిన వారిపై చర్యలు ఉండాల్సిందేనన్నారు. ఎక్కడెక్కడ లాభాలు ఉన్నాయి. ఎవరు ఎవర్ని కొనుగోలు చేస్తున్నారనేది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు.

కాగా ఎమ్మెల్యేల ట్రాపింగ్ కేసును ఈరోజు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. సీబీఐతో విచారణ జరపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 111 పేజీలతో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు నిందితుల హక్కులను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకున్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ను పూర్తిగా సమర్దిస్తామని డివిజన్ బెంచ్ తెలిపింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన రామ్ కిషన్ ఫోజి తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. లెటర్స్ పేటెంట్ క్లాస్ 15 ప్రకారం కేసు పూర్తిగా క్రిమినల్ జురడిక్షన్ పరిధిలోకి వస్తుందని తెలిపింది. మెరిట్స్ లోకి వెళ్లకుండా క్రిమినల్ జురిడిక్షన్ పైనే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది.