Allari Naresh : మళ్ళీ ఆ కాంబో.. నాంది 2 ??

కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ గతంలోనే నేను, గమ్యం..లాంటి పలు సినిమాలతో కంటెంట్ సినిమాలు కూడా తీయగలను, ఎలాంటి పాత్ర అయినా పోషించగలను అని..............

Allari Naresh : మళ్ళీ ఆ కాంబో.. నాంది 2 ??

Nandi 2

Updated On : June 27, 2022 / 2:30 PM IST

Allari Naresh :  కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ గతంలోనే నేను, గమ్యం..లాంటి పలు సినిమాలతో కంటెంట్ సినిమాలు కూడా తీయగలను, ఎలాంటి పాత్ర అయినా పోషించగలను అని నిరూపించారు. ఇటీవల కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఆ సమయంలో మళ్ళీ తనలోని నటుడ్ని బయటకి తీసి కంటెంట్ ఆధారంగా నాంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.

దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాణంలో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది సినిమా చాలా రోజుల తర్వాత నరేష్ కి మంచి విజయం తెచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా నాంది దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో మరో సినిమాని ప్రకటించాడు నరేష్. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

Vaishnav Tej : చెప్పిన మాట వింటే భలే ముద్దొస్తావు.. రంగరంగ వైభవంగా టీజర్ రిలీజ్..

ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో రెండు చేతులకి సంకెళ్లు వేసి ఉన్నాయి. ఇది నరేష్ 60వ సినిమా. అయితే ఈ పోస్టర్ చుసిన వారంతా ఇది నాంది 2 అవ్వొచ్చు అని భావిస్తున్నారు. మరి ఇది నాంది 2నా లేదా వేరే సినిమానా అని చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ కంటెంట్ సినిమాలతో వచ్చి హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు అల్లరి నరేష్.

 

 

View this post on Instagram

 

A post shared by Allari Naresh (@allari_naresh)