Allu Aravind : బన్నీ భార్య పై అల్లు అరవింద్ కామెంట్స్.. కోడలు గురించి ఏమి మాట్లాడాడో తెలుసా?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా ఫంక్షన్ లో ఎప్పుడు తన కోడలి గురించి మాట్లాడని అల్లు అరవింద్ మొదటిసారి ఒక మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడాడు.

Allu Aravind : బన్నీ భార్య పై అల్లు అరవింద్ కామెంట్స్.. కోడలు గురించి ఏమి మాట్లాడాడో తెలుసా?

allu aravind sneha reddy allu arjun

Allu Aravind : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా ఫంక్షన్ లో ఎప్పుడు తన కోడలి గురించి మాట్లాడని అల్లు అరవింద్ మొదటిసారి ఒక మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడాడు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు.

Allu Aravind : ఆహాని నిలబెట్టింది సుహాస్.. అల్లు అరవింద్!

ఇక సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు ఒక అంశం బాగా నచ్చేసింది. ప్రతి ఆడపిల్ల ఈ సినిమాకి మీ తల్లిదండ్రులను తీసుకోని వెళ్ళండి. ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ ఆడపిల్లని ఒక ధోరణిలో చూస్తారు. ఆడపిల్ల పుడితే పెంచాలి, చదివించాలి, చివరికి చదివిన చదువుని పక్కన పెట్టి పెళ్లి చేసి పంపించాలి. ఇదే జరుగుతుంది ఎప్పటినుంచో. కానీ ఆ ఆడబిడ్డకు ఆశలు, కోరికలు ఉంటాయని, వాటిని తల్లిదండ్రులు గౌరించాలని ఈ సినిమా తెలియజేసింది.

ఈ మూవీ చూశాక నేను ఇంటికి వెళ్లి నా భార్య కోరికలు ఏంటో తెలుసుకున్నాను. అంతలా ఈ చిత్రం నన్ను ప్రభావితం చేసింది. నేను ఆడపిల్లలు ఇంటిలో కూర్చోవడాని అంగీకరించాను. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ పై నిలబడలే ఉండాలి. నా కోడలు స్నేహరెడ్డి ఉంది, ఆమెకు పని చేయాల్సిన అవసరం లేదు. తాను పుట్టడమే గొప్ప ఇంటి కుటుంబంలో పుట్టింది. బన్నీ లాంటి పెద్ద స్టార్ ని పెళ్లి చేసుకుంది. అయినా సరే ఆమె ఇంకా వర్క్ చేస్తూ తన కాళ్ళ పై తను నిలబడడానికి ప్రయత్నిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.