Allu Aravind : ఆహాని నిలబెట్టింది సుహాస్.. అల్లు అరవింద్!

తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రలో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ ప్లాట్‌ఫార్మ్. ఇక బాలకృష్ణ అన్‌స్టాపబుల్ తో అయితే ఇండియాలోనే హైయెస్ట్ రీచ్ ని సొంతం చేసుకొని రికార్డు సృష్టిస్తుంది. అయితే ఈ ఆహా నిలబడడానికి మాత్రం ఒక చిన్న హీరో కారణం అంటున్నాడు అల్లు అరవింద్.

Allu Aravind : ఆహాని నిలబెట్టింది సుహాస్.. అల్లు అరవింద్!

Allu Arvind suhas

Allu Aravind : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రలో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ ప్లాట్‌ఫార్మ్. ఇక బాలకృష్ణ అన్‌స్టాపబుల్ తో అయితే ఇండియాలోనే హైయెస్ట్ రీచ్ ని సొంతం చేసుకొని రికార్డు సృష్టిస్తుంది. అయితే ఈ ఆహా నిలబడడానికి మాత్రం ఒక చిన్న హీరో కారణం అంటున్నాడు అల్లు అరవింద్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ‘సుహాస్’.

Balakrishna : మరోసారి వివాదంలో బాలకృష్ణ.. క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్!

సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బన్నీ వాసు నా దగ్గరకి వచ్చి రైటర్ పద్మభూషణ్ సినిమాని మనం రిలీజ్ చేద్దాం అన్నాడు. మొదటిలో నేను ఆసక్తి చూపించలేదు, కానీ సినిమా చూసిన తరువాత తప్పకుండా రిలీజ్ చేయాలి అనిపించింది.

ఈరోజు మాకు మంచి విజయాన్ని అందించింది ఈ సినిమా. సుహాస్ హీరోగా తెరకెక్కిన రెండో చిత్రం ఇది. ఇతను హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా కూడా మీమే రిలీజ్ చేశాము. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన కలర్ ఫోటో చిత్రాన్ని ఆహా ద్వారా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేశాము. అది ఎంత పెద్ద హిట్టు అయ్యిందో మీ అందరికి తెలుసు. మా ఆహాకు అదే మొదటి సక్సెస్. ఆ సినిమాకు వచ్చిన ప్రజాధారణ మా ఆహాకు రీచ్ పెరిగేలా చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించింది. రోహిణి, ఆశిష్ విద్యార్ధి ప్రధాన పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.