Allu Arjun: త్రివిక్రమ్‌తో బన్నీ సైలెంట్‌గా కానిచ్చేశాడు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప-2 కోసం రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఓ బ్రాండ్ యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.

Allu Arjun: త్రివిక్రమ్‌తో బన్నీ సైలెంట్‌గా కానిచ్చేశాడు!

Allu Arjun Ad Shoot With Trivikram

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప-2 కోసం రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈసారి పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Allu Arjun : ఐకాన్ స్టార్ ఒక్క ఫొటోతో.. ‘పుష్ప’పై ఎన్నో అనుమానాలు..

ఇక ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా సమయం ఉండటంతో ఈలోగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తూనే, పలు యాడ్ షూటింగ్స్‌లో బన్నీ బిజీగా మారుతున్నాడు. ఇటీవల బ్యాంకాక్‌లో ఓ బ్రాండ్ కోసం యాడ్ చేసి వచ్చిన బన్నీ, తాజాగా రామోజీ ఫిలిం సిటీలో మరో బ్రాండ్ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ షూటింగ్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా, మరోసారి ఈ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Allu Arjun : అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం.. అమెరికాలో..

అటు పుష్ప-2 సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండటంతో ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. మరి త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ బ్రాండ్ ఏమిటో.. దానిలో బన్నీ ఎలా కనిపిస్తాడో తెలియాలంటే ఈ యాడ్‌ను రిలీజ్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.