Allu Arjun : బేబీ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ పెడుతున్న ఐకాన్ స్టార్.. 40 కోట్లు దాటేసిన కలెక్షన్స్..

బేబీ చిత్రయూనిట్ ప్రస్తుతం సక్సెస్ మీట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ పెట్టగా నేడు అప్రిషియేషన్ మీట్ పెట్టబోతున్నారు.

Allu Arjun : బేబీ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ పెడుతున్న ఐకాన్ స్టార్.. 40 కోట్లు దాటేసిన కలెక్షన్స్..

Allu Arjun appreciation Meet for Baby Movie Unit

Baby Movie :  ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. చిన్న సినిమా అయినా ఇప్పటివరకు ఏకంగా 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కలెక్షన్స్ ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.

ప్రేక్షకులు మాత్రమే కాదు స్టార్ సెలబ్రిటీలు కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, రవితేజ, నాగబాబు, రష్మిక, మెహరీన్, రాశిఖన్నా, సుకుమార్.. లాంటి పలువురు స్టార్స్ బేబీ సినిమాని మెచ్చుకున్నారు. బేబీ చిత్రయూనిట్ ప్రస్తుతం సక్సెస్ మీట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ పెట్టగా నేడు అప్రిషియేషన్ మీట్ పెట్టబోతున్నారు.

Prabhas : బాహుబలి తరువాత ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్స్ చూశారా..? ఫ్యాన్ ఎడిట్స్‌ని మెప్పించలేక..!

నేడు జులై 20న హైదరాబాద్ లో బేబీ సినిమా అప్రిషియేషన్ మీట్ పెడుతున్నారు. అయితే ఈ మీట్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టడం విశేషం. అల్లు అర్జున్ ప్రత్యేకంగా బేబీ సినిమా యూనిట్ ని ఆహ్వానించి వారిని అభినందించనున్నారు. బేబీ సినిమాని నిర్మించిన SKN, మారుతి, ధీరజ్.. వీళ్లంతా అల్లు అర్జున్ కి క్లోజ్ సర్కిల్ లో ఉండే వాళ్ళే. వాళ్లంతా ఇలాంటి మంచి విజయం సాధించినందుకు ఈ మీట్ పెడుతున్నారు. ఇక ఐకాన్ స్టార్ కొంచెం గ్యాప్ తర్వాత సినిమా ఈవెంట్ కి రాబోతుండటంతో బన్నీ కోసం, బన్నీ స్పీచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.