Allu Arjun : ఐకాన్ స్టార్ మరో మాస్ లుక్.. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం..

తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో సరికొత్త యాడ్‌లో యాక్ట్ చేశాడు. ఈ యాడ్ షూట్‌ కోసం మరో నయా లుక్‌లో కనిపించాడు. బన్నీని ఊర మాస్ లుక్ కనపడేలా చేంజ్ చేశారు. ఈ లుక్ ని తన సోషల్ మీడియాలో............

Allu Arjun :  ఐకాన్ స్టార్ మరో మాస్ లుక్.. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం..

Allu Arjun

Allu Arjun :  అల్లు అర్జున్ పుష్ప తో పాన్ ఇండియా రేంజ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు అంతా బన్నీ నుంచి పుష్ప-2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పుష్ప 2 రోజు రోజుకి డిలే అవుతుంది. ఇన్నాళ్లు పుష్ప స్టైల్ మైంటైన్ చేస్తున్న బన్నీ సడెన్ గా రెండు కొత్త గెటప్స్ తో కనిపించి షాక్ ఇచ్చాడు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్ షూట్ చేయగా దానికి చాలా క్లాస్ గా మారి ఫొటోషూట్ చేశాడు. ఆ ఫోటో బాగా వైరల్ గా మారింది. తాజాగా మరో మాస్ లుక్ లో ఓ ఫోటోని షేర్ చేశాడు బన్నీ.

Vijay Devarakonda : అందరికి అతనే కావాలి.. విజయ్ దేవరకొండ మీద కన్నేసిన హీరోయిన్స్..

తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో సరికొత్త యాడ్‌లో యాక్ట్ చేశాడు. ఈ యాడ్ షూట్‌ కోసం మరో నయా లుక్‌లో కనిపించాడు. బన్నీని ఊర మాస్ లుక్ కనపడేలా చేంజ్ చేశారు. ఈ లుక్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. ఇందులో చెవి పోగులు, సైడ్ కటింగ్, షర్ట్ మీద షర్ట్, మేడలో చైన్, ఉంగరాలు, నోట్లో సిగార్, కళ్ళజోడు పెట్టుకొని ఫుల్ మాస్ గా కనిపించాడు. ఈ ఫోటో షేర్ చేసి..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు బన్నీ. బన్నీని ఈ రేంజ్ లో మాస్ లుక్ లో చూడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.