Vijay Devarakonda : అందరికి అతనే కావాలి.. విజయ్ దేవరకొండ మీద కన్నేసిన హీరోయిన్స్..

విజయ్ దేవరకొండ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు, లైగర్ తో పాన్ ఇండియా క్రేజీ హీరో అవుతున్నాడు. దాంతో సౌత్, నార్త్ అని తేడా లేకుండా నార్మల్ అమ్మాయిలే కాదు, క్రేజీ హీరోయిన్స్ కూడా..........

Vijay Devarakonda : అందరికి అతనే కావాలి.. విజయ్ దేవరకొండ మీద కన్నేసిన హీరోయిన్స్..

Vijay Devarakonda

Vijay Devarakonda :  ఇప్పుడు ఇండియన్ వైడ్ అమ్మాయిలకు హాట్ కేక్ అయ్యాడు విజయ్ దేవరకొండ. చూడ్డానికి అందంగా ఉంటాడు. వాయిస్ బేస్, మాటల్లో బోల్డ్ నెస్, మంచి బాడీ ఉండటంతో అమ్మాయిల మనసు దోచే నేషనల్ క్రష్ గా మారిపోయాడు రౌడీహీరో. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టు హీరోయిన్స్ అందరికీ విజయ్ దేవరకొండే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతున్నాడు. ఇండస్ట్రీ ఏదైనా, హీరోయిన్ ఎవరైనా ఈ రౌడీ హీరో పైనే మనసు పారేసుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు, లైగర్ తో పాన్ ఇండియా క్రేజీ హీరో అవుతున్నాడు. దాంతో సౌత్, నార్త్ అని తేడా లేకుండా నార్మల్ అమ్మాయిలే కాదు, క్రేజీ హీరోయిన్స్ కూడా ఆయనపైనే మనసు పారేసుకుంటున్నారు. లైగర్ సినిమా రిలీజ్ కాకుండానే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రౌడీబాయ్ ఇప్పటికే ఒకరేంజ్ లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించాడు. బాలీవుడ్ మీద కాన్సంట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం విజయ్ ఛాన్స్ దొరికితే చాలు ముంబైలో లాండ్ అవుతున్నాడు. లైగర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పార్టిస్పేట్ చేస్తున్న రౌడీ బాయ్ తాజాగా అనన్య పాండేతో ముంబై లోకల్ ట్రెయిన్ జర్నీ చేశాడు. ఈ ప్రమోషన్స్ లో విజయ్ అనన్యపాండే ఒళ్లో పడుకొని ఉన్న ఫోటో బాగా వైరల్ గా మారింది.

Vijay Devarakonda : రష్మిక నా డార్లింగ్.. తనంటే నాకు చాలా ఇష్టం అంటున్న విజయ్ దేవరకొండ..

ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన హీరోయిన్స్ అంతా విజయ్ గురించే మాట్లాడారు. అనన్య విజయ్ ని పొగిడేస్తుంటే విజయ్.. నువ్వు చాలా అందమైన అమ్మాయివి, నన్ను ఫ్లర్ట్ చేయడం ఆపు అని అన్నాడు షోలో. విజయ్ దేవరకొండకు వీరాభిమాని అయిన జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ గారాల పట్టీ సారా అలీఖాన్ ఇద్దరూ ఒకేసారి కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్నప్పుడు ఇద్దరికీ విజయ్ తోనే డేటింగ్ చేయాలని ఉందని చెప్పారు. అనన్య కూడా విజయ్ అంటే ఇష్టమని చెప్పింది.

ఇటీవల లైగర్ నుంచి విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ అంతా ఆ ఫోటోని షేర్ చేసి ప్రమోట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. సమంత, అనుష్క, రష్మిక, పూజాహెగ్డే, జాన్వీ కపూర్, కొంతమంది చిన్న హీరోయిన్స్.. ఇలా అందరూ విజయ్ ఫోటో షేర్ చేసి పొగిడేశారు. కొత్తగా వచ్చే హీరోయిన్స్ ని ఎవర్ని అడిగినా విజయ్ దేవరకొండతో ఒక్క సినిమా అయినా చేయాలి అనుకుంటున్నాము అనే చెప్తున్నారు. ఇక మాములు జనాల్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరంలేదు. ఇటీవల ఒక అమ్మాయి విజయ్ దేవరకొండ ఫోటో ని వీపు మీద టాటూ వేయించుకొని వైరల్ అయింది. ఇలా మాములు జనాల నుంచి స్టార్ హీరోయిన్స్ అందరికి ఫేవరేట్ అయిపోయాడు విజయ్ దేవరకొండ.