Allu Arjun Pushpa: రెండు పార్టులుగా పుష్ప.. అభిమానులకు పండగే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చనున్న సినిమా పుష్ప. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా పుష్ప కాగా బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే.

Allu Arjun Pushpa: రెండు పార్టులుగా పుష్ప.. అభిమానులకు పండగే!

Allu Arjun Pushpa In Two Parts Festival For Fans

Allu Arjun Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చనున్న సినిమా పుష్ప. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా పుష్ప కాగా బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే పుష్ప సినిమా కోసం మెగా అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా.. పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుందని కొద్దిరోజులుగా తెగ ప్రచారం జరుగుతుంది. అయితే, అది దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది.

పుష్ప సినిమా నిర్మాతల్లో ఒకరైన వ్యక్తి ఈ అంశంపై స్పందించినట్లుగా తెలుస్తుంది. సినిమా రెండు భాగాల అంశంపై స్పందించిన నిర్మాత ఎంతో స్పాన్‌ ఉన్న ఈ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమేనని.. అందుకే రెండు భాగాల ఆలోచన చేస్తున్నట్లుగా వెల్లడించారట. ఇప్పటికే హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌తో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. పుష్ప రెండు భాగాలుగా రావడం దాదాపుగా ఖరారవడంతో మెగా అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్ల హోరు మొదలైంది.

కాగా, గతంలో సుకుమార్-బన్నీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఆర్య, ఆర్య-2. ఈ రెండు సినిమాల కథ పూర్తిగా విరుద్ధమైనా టైటిల్స్ మాత్రమే ఒకేలా పెట్టారు. కానీ, ఇప్పుడు పుష్ప ఒకే కథతో రెండు భాగాలుగా రూపొందుతుంది. సీక్వెన్స్ రూపంలో ఈ రెండు భాగాలు విడుదల చేయనున్నారని చెప్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాను ఆగష్టు 13న విడుదల చేయనున్నట్లుగా తేదీ ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరులో సినిమా విడుదల చేయాలని మేకర్స్ కొత్త టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

Read: Lucifer Remake: మోహన్ రాజా ఔట్.. మెగా రీమేక్ కోసం ఆగని దర్శకుడి వేట?