Allu Arjun: పుష్పకి బ్రేక్ ఇచ్చేసి దుబాయ్ చెక్కేసిన బన్నీ!

ఎప్పుడూ షూట్స్ తో బిజీగా ఉంటే హీరోలకు కాస్త టైమ్ దొరికిందంటే ఫుల్ టైమ్ ప్యామిలీ కే స్పెండ్ చేస్తారు. రిలీజ్ టెన్షన్స్ తో టైట్ షెడ్యూల్ లో షూట్ చేస్తున్న అల్లు అర్జున్..

Allu Arjun: పుష్పకి బ్రేక్ ఇచ్చేసి దుబాయ్ చెక్కేసిన బన్నీ!

Allu Arjun

Allu Arjun: ఎప్పుడూ షూట్స్ తో బిజీగా ఉంటే హీరోలకు కాస్త టైమ్ దొరికిందంటే ఫుల్ టైమ్ ప్యామిలీ కే స్పెండ్ చేస్తారు. రిలీజ్ టెన్షన్స్ తో టైట్ షెడ్యూల్ లో షూట్ చేస్తున్న అల్లు అర్జున్.. పుష్ప షూటింగ్ టైమ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి చెక్కేశారో చూద్దాం.

Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!

షూటింగ్స్ ఉన్నంత సేపూ ఫుల్ గా సినిమా మీదే కాన్సన్ ట్రేట్ చేసే హీరోలు కాస్త టైమ్ దొరికినా ఫ్యామిలీతోనే ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంతే.. ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయారు. హెక్టిక్ షెడ్యూల్ తో షూట్ చేస్తున్న పుష్ప సినిమాకు సంబందించి చిన్న బ్రేక్ తీసుకున్న బన్నీ.. మొన్నటి వరకూ అవార్డ్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు. తర్వాత సడెన్ గా ఫ్యామిలీతో సహా దుబాయ్ లో ప్రత్యక్షం అయ్యారు.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

సినిమాలతో పాటు ఫ్యామిలీకి సంబందించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి అప్ డేట్స్ ఇచ్చే అల్లు అర్జున్.. ఈ సారి కూడా దుబాయ్ లో ఉన్నానోచ్ అంటూ మంచి పిక్ పోస్ట్ చేశారు. పుష్ప వర్క్ స్ట్రెస్ తో ఫిజికల్ గా, మెంటల్ గా ఎంగేజ్ అయిపోయి ఉన్న బన్నీ.. ఈ స్ట్రెస్ కి చిన్న బ్రేక్ ఇచ్చి ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకుండా కామ్ గా దుబాయ్ వెళ్లి.. అక్కడ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Icon Star Allu Arjun: లైన్‌లో మరో రెండు సినిమాలు.. తగ్గేదే లే అంటున్న బన్నీ!

సినిమాలతో పాటు ఫ్యామిలీని కూడా బాగా బ్యాలెన్స్ చేసుకునే బన్నీ.. పుష్ప సినిమా షూట్ కి మాత్రం అంతకుముందు సినిమాల కన్నా ఎక్కువ టైమే ఇస్తున్నారు. అందుకే షూట్ లో ఏ ఛిన్న బ్రేక్ దొరికినా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ పుష్ప 2 పార్ట్స్ గా వస్తోంది. పుష్పరాజ్ గా మాస్ క్యారెక్టర్ చేస్తున్న బన్నీ.. పుష్ప సినిమాతో క్రిస్ మస్ కి ఆడియన్స్ ముందుకురాబోతున్నారు.