Allu Sirish : అల్లు శిరీష్ కొత్త సినిమా.. ప్రీ – లుక్ అదిరిందిగా..!

మే 30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 6 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు..

Allu Sirish : అల్లు శిరీష్ కొత్త సినిమా.. ప్రీ – లుక్ అదిరిందిగా..!

Allu Sirish

Allu Sirish: ‘కొత్త జంట‌’, ‘శ్రీర‌స్తు శుభ‌స్తు’, ‘ఏబిసిడి’ వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో, ‘ఒక్క క్ష‌ణం’ వంటి వినూత‌్నమైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్.. ఇప్పుడు త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 6 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

Allu Sirish : అల్లు శిరీష్ మేకోవర్ అదిరిందిగా..!

ఈ సినిమాలో శిరీష్‌కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అను ఇమ్మానుయెల్ న‌టిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘100% ల‌వ్’, ‘భలే భ‌లే మ‌గాడివోయ్’, ‘గీత‌ గోవిందం’, ‘ప్ర‌తిరోజూ పండుగే’ వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా రూపొందుతుంది. మే 30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 6 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ వివ‌రాల‌ను తెలుపుతూ విడుద‌ల చేసిన ప్రీ లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Allu Sirish

అల్లు శిరీష్, అను ఇమ్మానుయెల్ మధ్య న‌డిచే రొమాన్స్ నేప‌థ్యంలో ఓ పొయేటిక్ స్టిల్‌తో ఈ ప్రీ- లుక్ విడుద‌ల చేశారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఈ ప్రీ- లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు, మ్యూజిక్, సాంకేతిక నిపుణ‌ల‌తో పాటు కీల‌క వివ‌రాల్ని త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు..