Allu sirish : జనాలు ‘ఆహా’కి నాకు సంబంధం ఉంది అనుకుంటున్నారు

కొంతమంది ఆహా వినియోగదారులు యాప్ లో ఏమైనా సమస్యలు ఎదురైతే సోషల్ మీడియాలో ఆహాని ట్యాగ్ చేస్తూ వారి సమస్యని చెప్తున్నారు. మరి కొంతమంది ఆహాతో పాటు అల్లు అరవింద్ ని, అల్లు అర్జున్......

Allu sirish : జనాలు ‘ఆహా’కి నాకు సంబంధం ఉంది అనుకుంటున్నారు

Allu Sirish

Allu Sirish :  అల్లు అరవింద్ స్థాపించిన తెలుగు ఓటీటీ ఆహా. ఇటీవల కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లతో ఆహా ఓటీటీ దూసుకుపోతుంది. అయితే ఇందులో అల్లు అరవింద్ మాత్రమే కాక మరికొంతమంది ఇందులో పార్ట్‌నర్లుగా ఉన్నారు. ఇటీవల అల్లు అర్జున్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఆహా చేసే ప్రతి ఈవెంట్ లోను అల్లు అర్జున్ భాగమవుతున్నారు. అల్లు అర్జున్ దగ్గరుండి ఆహాని ప్రమోట్ చేస్తున్నారు. అయితే అల్లు అరవింద్, అల్లు అర్జున్ తప్ప మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఆహాకి సంబంధించిన వాటిల్లో భాగమవ్వట్లేదు. అల్లు బాబీ ఆహాకి సాంకేతిక సలహాదారుడిగా ఉన్నారు.

కొంతమంది ఆహా వినియోగదారులు యాప్ లో ఏమైనా సమస్యలు ఎదురైతే సోషల్ మీడియాలో ఆహాని ట్యాగ్ చేస్తూ వారి సమస్యని చెప్తున్నారు. మరి కొంతమంది ఆహాతో పాటు అల్లు అరవింద్ ని, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లని కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ఆహాలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సోషల్ మీడియాలో వీళ్ళందర్నీ ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై అల్లు శిరీష్ స్పందించారు.

Rangamarthanda : డ్యాన్స్ మాస్టర్‌గా ప్రకాష్‌రాజ్ భార్య.. కృష్ణవంశీ దర్శకత్వంలో…

ఇటీవల ఓ ఆహా వినియోగదారుడు తన సమస్యని ట్వీట్ చేస్తూ ఆహాతో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్ ని కూడా ట్యాగ్ చేశాడు. అల్లు శిరీష్ ఈ ట్వీట్ ని షేర్ చేసి.. ”ఆహాని ట్యాగ్ చేస్తూ చాలామంది నేను ఆహా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నారు. దయచేసి ఆహా టీం ఈ కంప్లైంట్స్ ని చూడండి” అని పోస్ట్ చేశారు. శిరీష్ ఇలా ట్వీట్ చేయడంతో కొంతమంది నెటిజన్లు శిరీష్ కి ఆహాకి సంబంధం లేదా ఆహా అల్లు ఫ్యామిలీదే కదా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అల్లు శిరీష్ ఆహాలో ఎటువంటి బాధ్యతలు ఇంకా స్వీకరించకపోవడంతో ఇలా పెట్టి ఉంటారని అంటున్నారు.