CM KCR BRS : ఏపీతో పాటు దేశమంతటా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది .. ప్రభంజనం సృష్టిస్తుంది : మంత్రి అజయ్ కుమార్

ఏపీతో పాటు దేశమంతటా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని .. ప్రభంజనం సృష్టిస్తుంది..సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు.

CM KCR BRS :  ఏపీతో పాటు దేశమంతటా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది .. ప్రభంజనం సృష్టిస్తుంది : మంత్రి అజయ్ కుమార్

Along with Andhra Pradesh BRS party will contest

BRS : కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన విషయంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. ఇన్ని రోజులు తన తెలంగాణ గడ్డ..తెలంగాణ ప్రజలు అని చెప్పుకునే సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రంతో ఉన్న బంధం తెగిపోయిందని వ్యాఖ్యానించారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని విడిచి వెళ్లటంలేదని…అయితే దేశ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS) గా కేసీఆర్ ప్రకటించారు. దీనిపై వస్తున్న వ్యాఖ్యలకు..విమర్శలకు టీఆర్ఎస్ నేతలు ధీటుగా సమాధానం చెబుతున్నారు.

దీంట్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ..జాతీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏపీలోనే కాకుండా దేశమంతా పోటీ చేస్తుందని..పోటీ చేయటమే కాకుండా ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ లో కొన్ని పార్టీలు విలీనం కావటానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. తెలంగాణ దేశానికి ఆదర్శంకాబోతోందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళతామనే వస్తున్న వార్తల్లో నిజం లేదని అసలు అటువంటి ఆలోచనే లేదని మంత్రి పువ్వాడ స్పష్టంచేశారు.

దేశానికి కావాల్సింది దేశాన్ని అమ్మే ప్రధాని కాద‌ని, దేశ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాల‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ సంకల్పంతో యావత్ దేశ నలుమూలల దేశ ప్రజలకు కోతలు లేని విద్యుత్ ఖచ్చితంగా అందితీరుతుంద‌న్నారు. కేసీఆర్ వెంట నడిస్తే యావద్దేశాన్ని అన్నపూర్ణ దేశంగా తీర్చిదిద్దవచ్చ‌ని..రైతుల సంక్షేమం కోసం తపనపడే కేసీఆర్ పాలనలో రైతు రాజు అయ్యే రోజులు కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు. దేశంలో బీజేపీ కేంద్ర పాలకుల నిర్ణయాలతో కొనసాగుతున్న నిరంకుశ పాలనను అంతమొందించేందుకు జాతీయ పార్టీగా బీఆర్ ఎస్ ప్రకటించడం పట్ల మంత్రి పువ్వాడ‌ హర్షం వ్యక్తం చేశారు.

బీజేపీ నాయకులు దేశ ప్రజలను తమ డొల్ల మాటలతో గుజరాత్ ను రోల్ మోడల్ గా చిత్రీకరిస్తూ బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని..రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.