Amazon Great India Festival: రూ.20వేలకు పైగా తగ్గిన ఐఫోన్, రూ.30వేలు తగ్గిన శాంసంగ్ ఫోన్

దసరాకు బొనాంజా ఆఫర్లను తీసుకొస్తుంది అమెజాన్.. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ నుంచి మొబైల్స్ పై ఆఫర్ల వెల్లువ కురియనుంది.

Amazon Great India Festival: రూ.20వేలకు పైగా తగ్గిన ఐఫోన్, రూ.30వేలు తగ్గిన శాంసంగ్ ఫోన్

Amazon Festival

Amazon Great India Festival: దసరాకు బొనాంజా ఆఫర్లను తీసుకొస్తుంది అమెజాన్.. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ నుంచి మొబైల్స్ పై ఆఫర్ల వెల్లువ కురియనుంది. అక్టోబర్ 3నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా శాంసంగ్, ఆపిల్, వన్‌ప్లస్, ఎంఐ, రెడ్ మీ మొబైల్స్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన టీజ్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది అమెజాన్.

ఈ సందర్భంగా 2019లో లాంచ్ అయిన ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ రూ.40 వేలలోపు ధరకే రానుంది. ఈ విషయాన్ని amazon అధికారిక మైక్రోసైట్లో పేర్కొంది. ఇక Samsung Galaxy s20fe 5g స్మార్ట్ ఫోన్ ధర ఏకంగా రూ.70వేల 499 నుంచి రూ.36వేల 999కు తగ్గించారు.

Oneplus 9 Nord 2 5g ఫోన్ ధర రూ.28వేల 499 నుంచి ప్రారంభం కానుంది. Oneplus9 R5g స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందించడంతో రూ.36వేల 999కే కొనుగోలు చేయవచ్చు. iqoo z3 రూ.15వేల 490 నుంచి స్టార్ట్ అవుతుంది. Red Mi9 స్మార్ట్ ఫోన్ ధర రూ.7వేల 920కు తగ్గనుంది. Red Mi Note 10 pro స్మార్ట్ ఫోన్ ధర రూ.16వేల 990కు తగ్గనుంది.

………………………………………….: ఆర్థిక లావాదేవీల్లో మార్పులు.. మనపై చూపించే ప్రభావమిదే..

Oneplus 9 pro సుమారు 50 వేల కంటే తక్కువ ధరలో, Oneplus 9 స్మార్ట్‌ఫోన్‌ 40 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుదారులకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో లభించే అవకాశం ఉంది. ఈ ఫెస్టివల్ సేల్‌లో దాదాపు అమెజాన్‌లోని స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు లేదా బ్యాంకు ఆఫర్లు వర్తించనున్నాయి. ఒకవేళ ప్రైమ్ మెంబర్ షిప్ ఉంటే మరిన్ని ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉంది.