Major changes from Oct 1: ఆర్థిక లావాదేవీల్లో మార్పులు.. మనపై చూపించే ప్రభావమిదే..

దేశ‌వ్యాప్తంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు.. షేర్‌మార్కెట్ల‌లో ట్రేడింగ్ త‌దిత‌ర అంశాల్లో స‌మూల మార్పులు ప్రారంభమైయ్యాయి. మారిన రూల్స్‌తో మనపై వ్య‌క్తిగ‌తంగానూ ప్ర‌భావం చూప‌నున్నాయి

Major changes from Oct 1: ఆర్థిక లావాదేవీల్లో మార్పులు.. మనపై చూపించే ప్రభావమిదే..

October 1 Rules

Major changes from Oct 1: దేశ‌వ్యాప్తంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు.. షేర్‌మార్కెట్ల‌లో ట్రేడింగ్ త‌దిత‌ర అంశాల్లో స‌మూల మార్పులు ప్రారంభమైయ్యాయి. మారిన రూల్స్‌తో మనపై వ్య‌క్తిగ‌తంగానూ ప్ర‌భావం చూప‌నున్నాయి. గతంలో మాదిరి కాకుండా శుక్ర‌వారం నుంచి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లలో.. ప్ర‌త్యేకించి డెబిట్‌, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ వాలెట్ల నుంచి ఆటో డెబిట్ రూల్స్ మారిపోయాయి.

ఆటో డెబిట్ పేమెంట్స్ కోసం ఆర్బీఐ అడిష‌న‌ల్ ఫ్యాక్ట‌ర్‌ అథంటికేష‌న్ తెచ్చింది. రూ.5వేల లోపు చెల్లింపుల‌పై ముంద‌స్తుగా బ్యాంకుకు అథంటికేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5వేలకు మించిన పేమెంట్స్ కోసం ఓటీపీ న‌మోదు చేయాలి. అల‌హాబాద్ బ్యాంక్‌, ఓరియంట‌ల్ బ్యాంక్‌, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు గతంలో జారీ చేసిన చెక్‌బుక్‌లు చెల్ల‌వు.

వీరంతా తమ బ్రాంచులకు వెళ్లి కొత్త చెక్‌బుక్ కోసం అప్లై చేసుకోవాలి. ఇండియ‌న్ బ్యాంకులో అల‌హాబాద్, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అవడం వల్లే ఇలా జరిగింది.

పలు బ్యాంకుల్లో డీ-మ్యాట్ అకౌంట్లు గ‌ల అకౌంట్ హోల్డర్లు సెప్టెంబ‌ర్ 30 లోపు కేవైసీ ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని గతంలోనే సెబీ నుంచి ఆదేశాలు వచ్చాయి. స‌కాలంలో కేవైసీ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌కుంటే డీ-మ్యాట్ ఖాతా స‌స్పెండ్ చేస్తారని అందులో పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయ‌డం కుదరదు. అప్పటి వరకూ సంబంధిత బ్యాంకు ఖాతాను యాక్టివేట్ చేయ‌కుండా వదిలేస్తుంది.

…………………………………………………: లోకల్ మైకెల్.. తిరిగే నీ పార్టులు మెలికల్
నామినీ త‌ప్ప‌నిస‌రి

స్టాక్ మార్కెట్ల‌లో ట్రేడింగ్ చేసే అకౌంట్ హోల్డర్లు.. డీ-మ్యాట్ ఖాతాల్లోనూ. . ట్రేడింగ్ ప‌త్రాల్లోనూ నామినీ ఫేరును కన్ఫామ్ చేయాలని సెబీ చెప్పింది. దీనికి సంబంధించి ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌డం ఇష్టం లేనివారు డిక్ల‌రేష‌న్‌ఫామ్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పాత డీ-మ్యాట్ ఖాతాదారులు రాబోయే మార్చి 2022 నాటికల్లా డిక్ల‌రేష‌న్ ఫామ్ నింపాలి.

ఫుడ్ బిజినెస్‌పై రిష్ట్రిక్షన్లు..
ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ ఆర్గనైజేషన్ల ట్రాన్సాక్షన్లపై ఫుడ్ సేఫ్టీ రెగ్యూలేట‌ర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ గైడ్‌లైన్స్ క‌ఠిన‌త‌రం చేసింది. ఫుడ్ బిజినెస్ ఆప‌రేట‌ర్లు వినియోగ‌దారుల‌కు జారీ చేసే బిల్లుల‌పై లైసెన్స్ నంబ‌ర్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఎంటర్ చేయాలి. ఇది పాటించని వారి లైసెన్స్ కచ్చితంగా రద్దు చేస్తారు.