Goat Farm : ఏఎంజీ గోట్ ఫామ్.. ఇక్కడ విదేశీ మేకలు లభించును

ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి వుండటంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో వుంచుకుని ఇటీవలికాలంలో కొంతమంది రైతులు వాణిజ్యసరళిలో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది.

Goat Farm : ఏఎంజీ గోట్ ఫామ్.. ఇక్కడ విదేశీ మేకలు లభించును

Commercial Goat Farming

Goat Farm : వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇటీవల.. వాణిజ్య సరళిలో విస్తరిస్తున్న రంగం జీవాల పెంపకం. మేకలు, గొర్రల పెంపకం అనాధిగా వస్తున్న కులవృత్తే అయినా, ఇటీవల కాలంలో వీటిపెంపకం, సన్నా, చిన్నకార రైతులు, నిరుద్యోగలకు మంచి ఉపాధిగా మారింది. అయితే ఒకే రకమైన మేకలను పెంచడం పరిపాటి.. కానీ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు దేశ విదేశాలకు చెందిన 10 రకాల మేకజాతులను పెంచుతున్నారు. మాంసోత్పత్తికే కాకుండా, కొత్త కొత్త బ్రీడ్ లను అభివృద్ధి చేస్తున్నారు.

READ ALSO : Blue Tongue And Muzzle Disease : గొర్రెలు, మేకల్లో నీలి నాలుక, మూతి వాపు వ్యాధి! నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవే!

వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్యసరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం. ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాలు, పచ్చిక బీళ్లలో వీటిని మేప విధానం వుండేది. కానీ ఇప్పుడు పచ్చికబీళ్లు తగ్గిపోవటం, వ్యవసాయం వ్యాపారంగా మారిపోవటంతో, శివారు భూముల్లో తప్ప, ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. డిమాండ్ మాత్రం నానాటికీ పెరుగుతోంది.

ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి వుండటంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో వుంచుకుని ఇటీవలికాలంలో కొంతమంది రైతులు వాణిజ్యసరళిలో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. ముఖ్యంగా  జాతుల ఎంపిక, పోషణ యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తిపై ప్రత్యేక శ్రద్ద, ఈ పరిశ్రమను విజయబాటలో నడిపిస్తాయని నిరూపిస్తున్నారు పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఇద్దరు యువకులు నిరూపిస్తున్నారు.

READ ALSO : Disease : గొర్రెలు, మేకలలో… కాలి పుల్ల రోగం నివారణ..

కేజ్ విధానంలో ఏర్పాటు చేసిన ఈ ఫాంలో పొట్టిగా, పొడవుగా.. దృడంగా.. పెద్ద చెవుల మేకలు.. ఇలా చాలా విభిన్న జాతుల మేకలు ఉన్నాయి. ఈ ఫాం మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ లో ఉంది. ఎ.ఎం.జి గోట్ ఫాం పేరుతో 5 ఏళ్లుగా పలురకాల మేకజాతులను పెంచుతూ..  నూతన రకాలను అభివృద్ధి చేస్తున్నారు యువకులు ముజీబ్, మహ్మద్ అలీం లు. ఇందులో మొత్తం 160కి పైగా జీవాలు ఉన్నాయి. అందులో 10 రకాల దేశీ, విదేశీ సంకర జాతులు ప్రధానాకర్షణగా నిలుస్తున్నాయి.

విదేశాలనుంచి దిగుమతి చేసుకుని మనదేశంలో అభివృద్ధి చేసిన ఆఫ్రికన్‌ బోయర్, న్యూజిలాండ్ జాతితో సంకరం చేసిన బార్బరీ, బ్యాంటం, రాజస్థాన్‌కు చెందిన సోజత్, మేవాతి, సిరోయి, పంజాబ్‌కు చెందిన బీటల్, హైదరాబాదీ లాంటి జాతులు ఇక్కడ ఉన్నాయి. ఒక్కో జాతిది ఒక్కో ప్రత్యేకత. ప్రధానంగా వీటన్నింటి మాంసం, పాల ఉత్పత్తి కోసం అక్కడ పెంచుతున్నారు. ఒక్కో జాతిని మరో జాతితో సంకరం చేసి కొత్తజాతుల్ని సైతం ఉత్పత్తి చేస్తున్నారు. విభిన్నమైన సంకరజాతి మేకలతో ఫామ్ పలువురిని ఆకర్షిస్తోంది.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

మేకల్ని పెంచేందుకు ఇక్కడ కేజ్‌ విధానం పాటిస్తున్నారు. జాతి ప్రకారం వేరుచేసి వాటికి ప్రత్యేకంగా ఒక కేజ్‌ని కేటాయిస్తున్నారు. నేలపై పెంచకుండా 3, 4 అడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ప్లాస్టిక్‌ ఫ్లోర్‌ని ఏర్పాటు చేశారు. దీనివల్ల మేకల మల, మూత్రాలు ఆ రంధ్రాల ద్వారా ఎప్పటికప్పుడు కింద పడిపోతాయని తెలిపారు. అపరిశుభ్రతకు, రోగాలకు అవకాశం ఉండదు. కేజ్‌ల వల్ల ఒక మేక నుంచి మరో మేకకు వ్యాధులు సోకవని చెబుతున్నారు.