COVID: కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌పై కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతుండడంతో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌ల్లో క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప‌రిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది.

COVID: కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌పై కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌

COVID 19

COVID: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతుండడంతో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌ల్లో క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప‌రిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది. కొవిడ్‌ను క‌ట్ట‌డి చేయ‌డం కోసం ప్ర‌జ‌లు క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయా రాష్ట్రాల‌కు సూచించింది. క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచాల‌ని చెప్పిందని గురువారం ఓ అధికారి మీడియాకు తెలిపారు.

prophet row: ఏ నేరం చేశానో పేర్కొన‌కుండా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు: అస‌దుద్దీన్ ఒవైసీ

కాగా, ఇటీవ‌లే మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌లతో పాటు తెలంగాణ‌, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ ఓ లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాల్లో క్ర‌మంగా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దీనిపై దృష్టి సారించాల‌ని, క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. భార‌త్‌లో కొత్త‌గా 7,240 మందికి క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్రలో బుధ‌వారం 2,701 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.