Waris Punjab De: అమిత్ షాకు హత్యా బెదిరింపులు.. ఇందిరా లాంటి పరిస్థితి తప్పదంటూ వారిస్ పంజాబ్ దే చీఫ్ సంచలన వ్యాఖ్యలు

అమృతపాల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే వందలాది మంది కత్తులతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఇక ఖలిస్తాన్ ఉద్యమంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశారని నేను గుర్తు చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయాలనుకుంటే దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని అన్నారు.

Waris Punjab De: అమిత్ షాకు హత్యా బెదిరింపులు..  ఇందిరా లాంటి పరిస్థితి తప్పదంటూ వారిస్ పంజాబ్ దే చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Amit Shah will face consequences like Indira: 'Waris Punjab De' chief

Waris Punjab De: వారిస్ పంజాబ్ దే సంస్థ సభ్యుడిని అరెస్ట్ చేయడం పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులకు దారి తీసింది. ఆ సంస్థ అధినేత అమృతపాల్ ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకే బెదిరింపులు చేశారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎదుర్కొన్న పరిస్థుల్నే హోంమంత్రి అమిత్ షా ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోకి సైన్యాన్ని పంపినందుకు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసినట్లు, అమిత్ షాకు కూడా అదే గతి పడుతుందని అమృతపాల్ సింగ్ ఇంతకు ముందు కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే దానికి కొనసాగింపుగా తాజా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

China Balloon US Pilot Selfie : చైనా నిఘా బెలూన్‌తో అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్ ‘సెల్ఫీ’..!.. ఫోటో విడుదల..

ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టిన కేసులో వారిస్ పంజాబ్ దే సభ్యుడు అయిన లవ్‌ప్రీత్ తూఫాన్‭ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గురువారం అమృత్‭సర్ పట్టణంలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై వందలాది మద్దతుదారులు దాడి చేసి అతడిని విడుదల చేశారు. దీనికి ముందు అమృతపాల్ స్పందిస్తూ “రాజకీయ ఉద్దేశ్యంతో మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారు కేసును 1 గంటలో రద్దు చేయకపోతే, తదుపరి ఏమి జరిగినా దానికి అడ్మినిస్ట్రేషనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేమేమీ చేయలేమని వారు అనుకుంటున్నారు. అందుకు మేం బలప్రదర్శన చేసి తీరుతాం” అని అన్నారు.

MCD House: సభలో బీజేపీ, ఆప్ సభ్యుల కుమ్ములాట.. నిన్న రాత్రి అలసిపోయి అక్కడే పడుకున్నారు. ఈరోజు లేవగానే మళ్లీ స్టార్ట్

అమృతపాల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే వందలాది మంది కత్తులతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఇక ఖలిస్తాన్ ఉద్యమంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశారని నేను గుర్తు చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయాలనుకుంటే దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని అన్నారు. ఇక దేశంలో ‘హిందూ రాష్ట్రం’ డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉద్యమంపై చేస్తున్న హెచ్చరికల్నే హిందూ రాష్ట్రం డిమాండ్ చేస్తున్న వారితో చేస్తే అమిత్ షా ఎంతకాలం హోంమంత్రిగా ఉంటారో చూస్తామంటూ అమృతపాల్ సింగ్ అన్నారు.