Project K : ఇంటిలో కూడా ప్రాజెక్ట్-k డ్రెస్‌లోనే ఉంటున్న అమితాబ్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ ప్రాజెక్ట్-K లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం అమితాబ్ బచ్చన్ ముంబైలోని తన ఇంటి వద్ద అభిమానులను కలుసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ ఆదివారం కూడా ఇంటి గేట్ ప్రాగణం వద్దకి చేరుకున్న అభిమానులకు అభివాదం చేసి ఆనందపరిచాడు. కాగా అమితాబ్ షేర్ చేసిన ఫొటోలో ఒక విషయం అందర్నీ ఆకట్టుకుంటుంది.

Project  K : ఇంటిలో కూడా ప్రాజెక్ట్-k డ్రెస్‌లోనే ఉంటున్న అమితాబ్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Amitab Bachchan staying in Project-k dress at home too

Project K : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ ప్రాజెక్ట్-K లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ తరువాత మరోసారి ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అమితాబ్. ప్రస్తుతం అమితాబ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రతి ఆదివారం అమితాబ్ బచ్చన్ ముంబైలోని తన ఇంటి వద్ద అభిమానులను కలుసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ ఆదివారం కూడా ఇంటి గేట్ ప్రాగణం వద్దకి చేరుకున్న అభిమానులకు అభివాదం చేసి ఆనందపరిచాడు.

Project K Making Video : న్యూ ఇయర్ స్పెషల్.. ప్రాజెక్ట్ K మేకింగ్ వీడియో వదిలిన టీం.. టైర్ తయారు చేయడానికి ఇంతా??

అందుకు సంబంధించిన ఫోటోలను అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు నా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. కాగా అమితాబ్ షేర్ చేసిన ఫొటోలో ఒక విషయం అందర్నీ ఆకట్టుకుంటుంది. అదేంటంటే అమితాబ్ వేసుకున్న జాకెట్ పై ప్రాజెక్ట్-K అని రాసి ఉంది. ఇంటిలో కూడా అమితాబ్ ప్రాజెక్ట్-K జాకెట్ లో కనిపించడంతో వైజయంతి మూవీస్ వాళ్ళు ఆ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పడుకోణె ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని సి అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే సినిమాలోని దీపికా పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.