Project K : ప్రభాస్ విందు భోజనంపై.. జీర్ణించుకోలేను అంటూ అమితాబ్ ప్రశంసలు..

తాజాగా అమితాబ్ కి తన ఫుడ్ రుచి చూపించాడు. ప్రస్తుతం ప్రభాస్ అమితాబ్ తో కలిసి 'ప్రాజెక్టు K' రెండో షెడ్యూల్ షూటింగ్ లో ఉన్నారు. ఇప్పటికే అమితాబ్ ''ప్రభాస్ తో యాక్ట్ చేయడం చాలా......

Project K : ప్రభాస్ విందు భోజనంపై.. జీర్ణించుకోలేను అంటూ అమితాబ్ ప్రశంసలు..

Prabhas

 

Prabhas :  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. త్వరలో ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల అవ్వనుంది. ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక తన సినిమాలోని హీరోయిన్స్ కి, ఆర్టిస్టులకు, ఇంటికి ఎవరైనా స్పెషల్ గా వస్తే ప్రభాస్ చేసే మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే. ప్రభాస్‌ తన ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తే సెట్ లో అందరికి పండుగే. వెరైటీ వంట‌లతో తన కో ఆర్టిస్టులకు అతిధి మర్యాదలు బాగా చేస్తాడు ప్రభాస్.

ప్రభాస్ ట్రీట్ ఇచ్చిన ప్రతీసారి ఆ వంటలని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆర్టిస్టులు. గతంలో ‘సాహో’ సినిమా షూటింగ్ టైంలో శ్రద్ధ కపూర్ కి, ‘సలార్’ చిత్రీకరణ షూటింగ్ లో శృతిహాసన్ కి, ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ కి ఇంటి నుంచి తెప్పించిన స్పెషల్ ఫుడ్ పెట్టడంతో వాళ్ళు ఫిదా అయిపోయారు. కొన్ని రోజుల క్రితం కరీనా కపూర్ ఫ్యామిలీకి బిర్యానీ పార్శిల్ పంపాడు, ఇటీవల ‘ప్రాజెక్టు K’ మొదటి షెడ్యూల్ లో దీపికా పదుకొనెకి కూడా ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్ తెచ్చి పెట్టాడు.

Naga Anvesh : త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న యువ హీరో..

తాజాగా అమితాబ్ కి తన ఫుడ్ రుచి చూపించాడు. ప్రస్తుతం ప్రభాస్ అమితాబ్ తో కలిసి ‘ప్రాజెక్టు K’ రెండో షెడ్యూల్ షూటింగ్ లో ఉన్నారు. ఇప్పటికే అమితాబ్ ”ప్రభాస్ తో యాక్ట్ చేయడం చాలా గర్వంగా ఉంది” అని ట్వీట్ కూడా చేశారు. తాజాగా ప్రభాస్ ఎప్పటిలాగే తన ఇంటి నుంచి తెప్పించిన స్పెషల్ వంటలతో అమితాబ్ కి ఫుల్ గా భోజనం పెట్టాడట. దీనిపై అమితాబ్ ట్వీట్ చేశారు.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉండొచ్చు??

ప్రభాస్ పెట్టిన భోజనం, చూపించిన అతిధి మర్యాదలపై అమితాబ్..”బాహుబలి ప్రభాస్ మీ దాతృత్యం చాలా గొప్పది. మీరు నా కోసం మీ ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం చాలా మందికి తినిపించవచ్చు. అంతేకాకుండా నాకోసం మీరు వండిన ప్రత్యేకమైన వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. మీ వంటలు, మీ అభిమానాన్ని మాత్రం జీర్ణించుకోలేను” అని ట్వీట్​ చేశారు.