Nithin : ఒరేయ్ నితిన్ అంటూ.. నితిన్‌పై ఫైర్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మ రాజశేఖర్

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నితిన్ ని గెస్ట్ గా రమ్మని పది రోజుల ముందే ఇన్వైట్ చేశాను. వస్తానని మాట ఇచ్చి ఇప్పుడు రాలేదు. నితిన్ కి నేను గురువు లాంటి వాడిని............

Nithin : ఒరేయ్ నితిన్ అంటూ.. నితిన్‌పై ఫైర్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మ రాజశేఖర్

Nithin

Amma Rajasekhar :  హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ హీరో నితిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగా కూడా పలు సినిమాలు తెరకెక్కించారు. తెలుగులో అమ్మ రాజశేఖర్.. రణం, ఖతర్నాక్, టక్కరి. లాంటి పలు సినిమాలని దర్శకుడిగా తెరకెక్కించారు. టక్కరి సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా, నిర్మాతగా ‘హయ్-ఫైవ్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ హీరో నితిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Hareesh Shankar : రామ్‌కి లవ్ స్టోరీ చెప్పాను వద్దన్నాడు.. రామ్‌తో సినిమా కచ్చితంగా ఉంటుంది..

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నితిన్ ని గెస్ట్ గా రమ్మని పది రోజుల ముందే ఇన్వైట్ చేశాను. వస్తానని మాట ఇచ్చి ఇప్పుడు రాలేదు. నితిన్ కి నేను గురువు లాంటి వాడిని. కానీ నితిన్ నన్నే మరచిపోయాడు. నితిన్ కి డ్యాన్స్ రాదు. కానీ నేను డ్యాన్స్ నేర్పించి ఒక పొజిషన్ ఇచ్చాను. ఇప్పుడు నా ఫస్ట్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి నితిన్ రాలేదు. నితిన్ బిజీగా కూడా లేడు. ఇంట్లో ఉండి కూడా రాలేదు. కనీసం వీడియో బైట్ ఇవ్వమని అడిగాను, అది కూడా చేయలేదు. నితిన్ కి కనీస మర్యాద కూడా తెలియకుండా పోయింది.”

”నితిన్ మాత్రమే కాదు హీరోలందరికీ చెబుతున్నాను.. మనకు సాయం చేసిన వాళ్ళని మరచిపోకూడదు. నితిన్ కి ఎవరు అవసరమో వాళ్ళ ఫంక్షన్ కి మాత్రమే వెళతాడు. ఇవాళ నితిన్ నన్ను ఇన్సల్ట్ చేశాడు. నితిన్ నాకు చాలా క్లోజ్. కానీ నా సినిమా ఫంక్షన్ కి రాలేదు. రాలేకపోతే కుదరదని చెప్పాలి, కానీ వస్తానని చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒరేయ్ నితిన్ నేను నిన్ను చాలా నమ్మాను. కానీ నువ్వు ఇలా చేసావు” అంటూ నితిన్ పై ఫైర్ అయ్యారు. దీంతో అమ్మ రాజశేఖర్ నితిన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చగా మారాయి.