Viral Video: స్వాంతంత్ర్య దినోత్సవాన ఓ సరదా వీడియో.. చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు

సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చిర్రెత్తుకొచ్చిన ఆ వృద్ధుడు తాగుబోతు తల పట్టుకుని నేలపై పడేయాలనుకుంటాడు. ఆ సమయంలో తాగుబోతు ఆ వృద్ధుడి కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Viral Video: స్వాంతంత్ర్య దినోత్సవాన ఓ సరదా వీడియో.. చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు

Updated On : August 15, 2023 / 8:36 PM IST

Independence Day: భారతదేశం ఈరోజు (ఆగస్టు 15) 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎర్రకోటతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ రోజున అనేక ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడింది. కాగా, మరొకపక్క ఇదే రోజున జరిగిన కొన్ని హాస్యాన్ని తెప్పించే ఆకతాయి చేష్టలు వైరల్ అవుతున్నాయి. ఇంతలో, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది, ఇది చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. ఓ తాగుబోతు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ స్కూటీ యజమానితో గొడవకు దిగాడు. నెటిజెన్లు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Maharashtra Politics: ఆ పార్టీతో చేతులు కలిసి శరద్ పవార్‭కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన ఉద్ధవ్ థాకరే

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఈ వృద్ధుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెల్లటి కుర్తా-పైజామా ధరించి ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అప్పుడే రోడ్డు మీద ఓ తాగుబోతు అతడితో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. రోడ్డు మీద చాలా వాహనాలు వెళుతున్నాయి. అయితే స్కూటీ యజమాని వైపు వెళ్తూ వేలు చూపించి ఆపమని సూచించాడు ఆ తాగుబోతు. స్కూటీ రైడర్ ఆగకపోవడంతో, ఈ తాగుబోతు అతని దగ్గరికి వెళ్లి స్కూటీని ఆపి, స్కూటీ రైడర్‌ని డ్యాన్స్ చేస్తూ ఆటపట్టించడం ప్రారంభించాడు. ఆ తర్వాత స్కూటీ రైడర్ ఆ తాగుబోతు వద్దకు వచ్చి గొడవపడ్డాడు.


ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చిర్రెత్తుకొచ్చిన ఆ వృద్ధుడు తాగుబోతు తల పట్టుకుని నేలపై పడేయాలనుకుంటాడు. ఆ సమయంలో తాగుబోతు ఆ వృద్ధుడి కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో జనం గుమిగూడారు. అంతలో ఒక బైక్ రైడర్ ఇద్దరినీ విడదీశాడు. అయితే కొంచెం ముందుకు వెళ్లి ఆ తాగుబోతు, ఆ వృద్ధుడిని చూస్తూ డ్యాన్స్ చేయడం ఇక్కడ కొస మెరుపు. ఈక ఈ వీడియో బాక్ గ్రౌండులో ‘దేశ్ ప్రేమియోన్ ఆప్సే మే ప్రేమ్ కరో దేశ్ ప్రేమియోన్’ అనే జాతీయ గీతం ప్లే అవుతోంది.