BiggBoss Non Stop : హౌస్‌మేట్స్‌ చేసిన తప్పుకు అనిల్ కెప్టెన్సీ రద్దు..

ఇటీవలే బిగ్‌బాస్‌ హౌస్ లో కెప్టెన్ గా అనిల్ రాధోడ్ ఎంపిక అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌ హౌస్ లో కొంతమంది రూల్స్ పాటించడం మానేశారు. బిగ్‌బాస్‌ రూల్స్‌ను కొంతమంది సీరియస్ గా.......

BiggBoss Non Stop : హౌస్‌మేట్స్‌ చేసిన తప్పుకు అనిల్ కెప్టెన్సీ రద్దు..

Anil Rathode

BiggBoss Non Stop :  బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రోజు రోజుకి మరింత రసవత్తరంగా సాగుతుంది. వారియర్స్‌ వర్సెస్ చాలెంజర్స్‌ అంటూ ఈ గేమ్ సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని టాస్కులతో వీరి మధ్య ఉన్న గొడవలని తగ్గించడానికి బిగ్‌బాస్‌ ప్రయత్నం చేశాడు. ఇటీవలే బిగ్‌బాస్‌ హౌస్ లో కెప్టెన్ గా అనిల్ రాధోడ్ ఎంపిక అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌ హౌస్ లో కొంతమంది రూల్స్ పాటించడం మానేశారు.

బిగ్‌బాస్‌ రూల్స్‌ను కొంతమంది సీరియస్ గా తీసుకోవట్లేదు. పగటిపూట నిద్రించకూడదన్న రూల్‌ ని కొంతమంది కంటెస్టెంట్స్ బ్రేక్ చేశారు. కొందరు కంటెస్టెంట్లు మైక్‌ పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు. ఇవన్నీ చూసి సీరియస్‌ అయిన బిగ్‌బాస్‌ వారు చేసిన తప్పులను వీడియో వేసి మరీ చూపించాడు. అయితే కెప్టెన్ గా అనిల్ ఇవన్నీ చూసుకోవాలని హెచ్చరించి, చూసుకోనందుకు శిక్ష విధించాడు బిగ్‌బాస్‌.

NTR : నా భార్య బర్త్‌డే వదిలేసి చరణ్ కోసం వెళ్ళేవాడిని

హౌస్‌మేట్స్‌ చేసిన తప్పుకు కెప్టెన్‌ అనిల్‌కు శిక్ష విధించాడు బిగ్‌బాస్‌. అతడి కెప్టెన్సీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. తను ధరించిన కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను స్టోర్‌రూమ్‌లో పెట్టాలని తెలిపాడు. దీంతో అనిల్ కెప్టెన్సీ పోయింది. ఇది చూసిన ప్రేక్షకులు అనిల్ పై జాలి పడుతున్నారు. గత సీజన్ లో కూడా మోడల్‌ జెస్సీ కెప్టెన్సీ ఇలాగే పోయింది. ఇప్పుడు అనిల్ వంతు అంటూ సింపతీ చూపిస్తున్నారు.