High Court Petition : RRRపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్
అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించారంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించడం దారుణం అన్నారు.

Rrr
Another petition against the RRR Movie : ట్రిపుల్ ఆర్ సినిమా చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారంటూ ఇప్పటికే కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. అల్లూరి పాత్రను వక్రీకరించారని పిటిషన్ వేశారు. అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషించగా, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించాడు.
అయితే, అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించారంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించడం దారుణమని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించడం దేశభక్తిని అవమానించడమేనంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
Corona RTC Depot : మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా
బ్రిటీష్ దొరల వద్ద అల్లూరి నృత్యం చేసినట్లు చూపారని పిటిషనర్ తెలిపారు. అల్లూరి, కుమురం భీమ్‌లు కలిసినట్టు చరిత్రలో లేదని, చరిత్రను వక్రీకరించి చూపించిన ఘట్టాలను తొలగించాలని కోరారు. వాస్తవాలను రూపొందించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.