feast in Gents Only:మాంసంతో ఉత్సవం..పురుషులు భోజనం చేశాక..అరిటాకులు ఎండిపోయే వరకు మహిళలు రాకూడదు

60 మేకల్ని కోసారు.బస్తాల బియ్యాన్ని అన్నం వండారు. గుట్టలా పోసారు..10 గ్రామాలకు చెందిన పురుషులు తిన్నారు. ఆ పురుషులు భోజనం చేశాక..వారు తిన్న అరిటాకులు ఎండిపోయేంత వరకు మహిళలు రాకూడదట

feast in Gents Only:మాంసంతో ఉత్సవం..పురుషులు భోజనం చేశాక..అరిటాకులు ఎండిపోయే వరకు మహిళలు రాకూడదు

Feast In Gents Only

feast in Gents Only : 10 గ్రామాలు. 7,000 మంది పురుషులు. 60 మేకలు. ఇన్ని వేలమంది ఉన్నా..ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్కరంటే ఒక్క ఆడమనిషి కూడా లేదు. కారణం. అదో సంప్రదాయం. 60 మేకల్ని కోసం 10 గ్రామాలకు చెందిన మగవారు అంతా కలిసి ఆ మేకల మాంసాలన్ని వండారు. శుభ్రరంగా తిన్నారు. కానీ వంటల్లో గానీ..కనీసం ఆ మేకమాంసం వంటను తినటానికి కూడా ఒక్క మహిళ అంటే ఒక్క మహిళ కూడా రాలేదు. రాకపోవటం కాదుకదా..ఆ చుట్టుపక్కల ఒక్క ఆడపిల్ల కూడా కనిపించలేదు. కారణం అదో సంప్రదాయం అట. కనీసం పురుషులు భోజనాలు చేసేసాక కూడా ఏ మహిళా రాలేదు. ఎందుకంటే చక్కగా మేకల్ని బిర్యానీ చేసుకుని తిన్న మగవారు తిన్న ఎంగిలి ఆకులు ఆరేదాకా ఆ చుట్టుపక్కలకు ఏ మహిళా రాకూడద..అదో సంప్రదాయమట..

Read more : వింత బోనాలు : ఐదేళ్లకోసారి ఊరంతా బంధనం..పూజలు పూర్తయ్యే వరకు గ్రామస్థులు పాచి ముఖం కడగరు, చీపురు పట్టరు

అది తమిళనాడు రాష్ట్రం మధురై సమీప అనుప్పపట్టిలోని కరుప్పయ్య ముత్తయ్య ఆలయం. ఈ ఆలయంలో ప్రతీ సంవత్సరం ఉత్సవాలు చేస్తుంటారు. ఈ ఉత్సవాల్లో 10 గ్రామాలకు చెందిన మగవారు పాల్గొంటారు. కానీ ఆ ఉత్సవాలకు ఆడవాళ్లు రాకూడదు. అన్ని పనులు పురుషులే చేస్తారు. అలా ఈ ఏడాది ఉత్సవాల్లో 60 మేకల్ని కోసారు. బస్తాల బియ్యం అన్నం వండారు. కోసిన ఆ 60 మేకల మాంసాన్ని వండారు.

Read more : వింత ఆచారం : మహిళలు రుతుక్రమం సమయంలో ఇళ్లలో ఉండకూడదంట

వండిన అన్నాని గుట్టలా పోసారు. పెద్ద పెద్ద పాత్రలు తెప్పించి అన్ని పనులు పురుషులే చేసుకున్నారు. చక్కగా ఘుమఘుమలాడే మేకమాంసం వంటకాల్ని పురుషులు అందరు కలిసి ఆరగించారు. ఈ ప్రక్రియే కాదు పురుషులు భోజనాలు చేసి పారేసిన ఎంగిలి అరిటాకులు ఎండిపోయేంత వరకు ఆ పరిసర ప్రాంతాల్లోకి కూడా స్త్రీలు రాకూడదన్నది నియమం. ఆ నియమాన్ని పురుషులు,స్త్రీలు పాటిస్తారు. అలా ఈ కరుప్పయ్య ముత్తయ్య ఆలయంలో జరిగిన ఉత్సవం పేరొందింది.

Read more : Borana tribe : గుండు గీయించుకుంటేనే మంచి భర్త వస్తాడట