Anushka Sharma : ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’‌.. మహిళా క్రికెటర్ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌లో అనుష్కశర్మ

 టీమ్‌ఇండియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’‌ అనే సినిమా తెరకెక్కుతుంది. అనుష్క శర్మ ఈ బయోపిక్ లో.............

Anushka Sharma : ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’‌.. మహిళా క్రికెటర్ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌లో అనుష్కశర్మ

Jhulan Goswami

Anushka Sharma :  టీమ్‌ఇండియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’‌ అనే సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్‌ నటి, ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఈ బయోపిక్ లో నటిస్తుంది. రాయితీ ఈ సినిమాని డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ చేయనున్నారు. ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’‌ టీజర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.

ఝులన్‌ గోస్వామి దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా, కెప్టెన్ గా ఎన్నో సేవలందించిది. ఆమె గత సంవత్సరం అన్ని ఫార్మేట్ల నుంచి రిటైర్ అయ్యింది. ఇప్పుడు ఝులన్‌ గోస్వామి బయోపిక్ ని అనుష్కశర్మతో నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా టీజర్ ని షేర్ చేస్తూ అనుష్కశర్మ ఆసక్తికర వ్యాఖ్యలని చేసింది. ఈ సినిమాకి అనుష్కశర్మనే నిర్మాత కావడం విశేషం.

Sankranthi Movies : సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు

అనుష్కశర్మ ఈ టీజర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… ”ఇదెంతో ప్రత్యేకమైన చిత్రం. ఎన్నో త్యాగాలు ఉన్న అద్భుతమైన కథ. ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్‌’ సినిమా.. టీమ్‌ఇండియా మహిళల జట్టు మాజీ సారథి ఝులన్‌ గోస్వామి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మహిళల క్రికెట్‌లో ఇది ఒక కనువిప్పు కలిగే చిత్రంగా నిలుస్తుంది. ఆమె క్రికెటర్‌ అవ్వాలని, ప్రపంచం ముందు భారత జట్టును సగర్వంగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆడవాళ్లు క్రికెట్‌ గురించి ఆలోచించడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సవాళ్ల నడుమ ఆమె క్రికెటర్‌గా ఎదిగి ఎలా రాణించారనేదే ఈ సినిమా” అని తెలిపింది.