Movie Theatres : ఏపీలో పెద్ద సినిమాలకు ఎఫెక్ట్..

అసలే కరోనా కారణంగా దెబ్బ తిన్న సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనుకుంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో సీన్ రివర్స్ అయ్యిందంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Movie Theatres : ఏపీలో పెద్ద సినిమాలకు ఎఫెక్ట్..

Big Movies

Movie Theatres: రోజుకి నాలుగు ఆటలు మాత్రమే.. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేదు.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు.. మిడ్ నైట్ షోలు, బెన్‌ఫిట్ షోలు, స్పెషల్ షోలకు నో పర్మిషన్.. సామాజిక సేవాకార్యక్రమాలకు సంబంధించి నిధుల సేకరణ కోసమైతేనే బెన్‌ఫిట్ షోలకు అనుమతి అని తేల్చి చెప్పేసింది ఏపీ ప్రభుత్వం.

దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా అలజడి రేగింది. బాబోయ్ ఇలాగైతే మా సినిమాల పరిస్థితి ఏంటి అంటూ నిర్మాతలు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. రాబోయే పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలకు భారీ నష్టం తప్పేలా లేదు. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుంది.
ఈ సినిమాలకు భారీ ఎఫెక్ట్..

Perni Nani : ఏపీ సినిమా ధియేటర్లలో రోజుకు 4 ఆటలే

డిసెంబర్ 2న బాలయ్య – బోయపాటిల ‘అఖండ’ భారీస్థాయిలో రిలీజ్ అవుతుంది. తర్వాత డిసెంబర్ 17న అల్లు అర్జున్ ‘పుష్ప’ పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. డిసెంబర్ 24న నాని ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ టైం నాని కెరీర్‌లో నాలుగు భాషల్లో రానుంది.

RRR Movie : రాజమౌళి సినిమాకి సల్మాన్ సపోర్ట్..

ఇక అసలు సందడి 2022 జనవరి 7న మొదలు కానుంది. క్రేజీ మల్టీస్టారర్.. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తర్వాత 12న పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’, 14న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ రిలీజ్ కానున్నాయి. అసలే కరోనా కారణంగా దెబ్బమీద దెబ్బ తిన్న సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనుకుంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో సీన్ రివర్స్ అయ్యిందంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Republic : ఫ్యాన్స్‌కి సాయి ధరమ్ తేజ్ వాయిస్ మెసేజ్

టికెట్ రేట్లు పెంచే విషయం పక్కన పెడితే.. రిలీజ్ అయ్యేవన్నీ స్టార్ హీరోల సినిమాలు.. అందులోనూ నాలుగు పాన్ ఇండియా (శ్యామ్ సింగ రాయ్ 4 భాషలు) సినిమాలున్నాయి. పండుగ సీజన్ కావడంతో ప్రేక్షకులు అన్ని సినిమాలూ చూస్తారు కాబట్టి మరో రెండు షోలు వేసుకునే అనుమతి ఇస్తే బాగుంటుంది అంటున్నారు కొందరు నిర్మాతలు.