వార్డు వాలంటీర్లపై ఆంక్షలు, రాజకీయ ప్రక్రియకు దూరంగా ఉండాలి – ఎస్ఈసీ

వార్డు వాలంటీర్లపై ఆంక్షలు, రాజకీయ ప్రక్రియకు దూరంగా ఉండాలి – ఎస్ఈసీ

NIMMAGADDA

ap sec : వార్డు వాలంటీర్లపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాజకీయ ప్రక్రియకు వారంతా దూరంగా ఉండాలని సూచించింది. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదని వెల్లడించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో త్వరలో జరగబోయే..మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన..పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు పలు సూచనలు చేశారు. గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంఘం మాట్లాడిందనే విషయాన్ని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని, రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

పథకాల పేరిట ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని, ఓటర్ స్లిప్పుల పంపణీని వార్డు వాలంటీర్లకు అప్పగించవద్దన్నారు. లబ్దిదారుల డేటా దృష్ట్యా వాలంటీర్ల ఫోన్లను నియంత్రించాలని, కమిషన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే..కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తామన్నారు. సాధారణ బాధ్యతలు నిర్వహించే వాలంటీర్లకు అడ్డంకులు లేవన్నారు.